NTV Telugu Site icon

Kishan Reddy : కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ మంత్రికి కిషన్ రెడ్డి లేఖ

Kishanreddy

Kishanreddy

ప్రస్తుత రబీ సీజన్ లో తెలంగాణ నుండి 15 లక్షల మెట్రిక్ టన్నుల ఉప్పుడు బియ్యాన్ని సేకరించండని కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ మంత్రికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. రైతు సంక్షేమంపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రభుత్వంలోని కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోందని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర రైతులకు కేంద్రప్రభుత్వం.. నిరంతరం మద్దతుగా నిలుస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

Also Read : GT vs KKR: విజయ్ శంకర్‌ వీరబాదుడు.. కోల్‌కతాకు భారీ లక్ష్యం

ఇకపైనా.. ఈ సహాయాన్ని కొనసాగిస్తూ.. ఈ రబీ సీజన్ లో తెలంగాణ నుండి 15 లక్షల మెట్రిక్ టన్నుల ఉప్పుడు బియ్యం (పారా బాయిల్డ్ రైస్) సేకరించమని కోరుతూ కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖమంత్రి శ్రీ పీయూష్ గోయల్ కు లేఖ రాశారు. 2015-16 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ లో 5.35 లక్షల మంది రైతులు కేంద్ర ప్రభుత్వ ధాన్య సేకరణ ద్వారా లబ్ధి పొందగా.. గత ఖరీఫ్ సీజన్లో 20 లక్షలమంది తెలంగాణ రైతులు లబ్ధిపొందారని కిషన్ రెడ్డి ఆ లేఖలో గుర్తుచేశారు. తెలంగాణ రైతుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని, ఈ రబీ సీజన్లో రాష్ట్రం నుంచి 15 లక్షల మెట్రిక్ టన్నుల పార్ బాయిల్డ్ రైస్ సేకరణకు ఉపక్రమించాలని పీయూష్ గోయల్ ను కిషన్ రెడ్డి కోరారు.

Also Read : Drown in Canal: కడప జిల్లాలో విషాదం.. ఈత కోసం వెళ్లి ముగ్గురు మృతి

Show comments