Site icon NTV Telugu

Kishan Reddy : ఇంటింటికీ వెళ్లి బీఆర్ఎస్ వైఫల్యాలను వివరించాలి

Union Minister Kishan Reddy

Union Minister Kishan Reddy

వచ్చే ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. ఈ నేపథ్యంలో పార్టీ బలోపేతాని కృషి చేస్తున్నారు నేతలు. అయితే.. ఈ క్రమంలోనే పార్టీ శ్రేణులకు కీలక ఆదేశాలు జారీ చేశారు తెలంగాణ బీజేపీ చీఫ్‌, కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. డబుల్ బెడ్రూం ఇండ్లు, రైతుల సమస్యలు, ధరణి, నిజాం షుగర్ ఫ్యాక్టరీ, నిరుద్యోగులకు చేసిన నష్టాన్ని ప్రజలకు వివరించాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. అంతేకాకుండా.. ‘ఇంటింటికీ వెళ్లి బీఆర్ఎస్ వైఫల్యాలను వివరించాలి. తెలంగాణ అభివృద్ధిపై రాష్​ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తుశుద్ధి లేదు. రాజకీయం తప్పితే కేసీఆర్ కు అభివృద్ధి చేయాలనే ఆలోచన లేదు. కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తానంటున్నా.. రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం లేదు. ఎంతసేపు నేను, నా తర్వాత నా కొడుకు, నా కుటుంబం అనేదే ధ్యేయంగా వారు పనిచేస్తున్నారు. మంత్రి కేటీఆర్ షాడో సీఎంలా వ్యవహరిస్తున్నారు. కుటుంబ పాలనను దీటుగా ఎదుర్కోవాలి. జిల్లా, అసెంబ్లీ స్థాయిలో ఎన్నికలకు సిద్ధం కావాలి.

Also Read : BANW VS INDW: టీమిండియా బ్యాటర్లకు నరకం చూపించిన బంగ్లా బౌలర్లు.. చివరికి ఇండియాదే సిరీస్..!

మనం కష్టపడి పనిచేస్తేనే ప్రజలు విశ్వసిస్తారు. బీఆర్ఎస్ ను ఎదుర్కొనే శక్తి బీజేపీకే ఉంది. ప్రజలకు మంచి చేసేది బీజేపీ మాత్రమే. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ కుటుంబ పాలన సాగిస్తూ కనుసైగలతో శాసిస్తున్నాయి. ఈ రెండు పార్టీలు లక్షల కోట్ల ప్రజాధనాన్ని దుర్వనియోగం చేస్తున్నాయి. రజాకార్లకు, నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన పార్టీ బీజేపీయే. కొట్లాడిన తెలంగాణ ఒక్క కుటుంబం చేతిలో బందీ అయింది. ఉద్యమాలు నిర్వహించి ప్రజలకు మంచి చేయాల్సిన బాధ్యత మనపై ఉంది. డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ అంశం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. ఆ ఇండ్లు ఎలా ఇస్తారు. ఏ ప్రాతిపదికన ఇస్తారేది ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ఏపీలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో లక్షల ఇండ్లు నిర్మించి ఇచ్చాం. తెలంగాణలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడంలేదు. సహకరించడం లేదు. కాంగ్రెస్ పార్టీకి 11 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఏ ప్రాతిపదికన ఆ పార్టీకి భూమి కేటాయించారో సమాధానం చెప్పాలి. నిరుపేదలకు ఇండ్లు కట్టిద్దామంటే జాగా ఉండదు.. కానీ కాంగ్రెస్ కు మాత్రం అప్పనంగా కేటాయించారు. ఏ సెగ్మెంట్ లోనూ పూర్తిస్థాయిలో ఇండ్ల నిర్మాణం చేపట్టలేదు. 9 ఏండ్లలో మహిళలకు పావలా వడ్డీ రుణాలు ఇచ్చింది లేదు.

Also Read : BANW VS INDW: టీమిండియా బ్యాటర్లకు నరకం చూపించిన బంగ్లా బౌలర్లు.. చివరికి ఇండియాదే సిరీస్..!

ఓల్డ్ సిటీకి మెట్రో అని కేసీఆర్ అంటున్నాడు. తొమ్మిదేండ్లలలో కేసీఆర్ కు ఎందుకు జ్ఞానం రాలేదు. ఎన్నికల సమయంలోనే గుర్తుకు వచ్చిందా?. ఎంఐఎం, బీఆర్ఎస్ రెండూ ప్రజలను మోసం చేస్తున్నాయి. ఎవరు అధికారంలో ఉంటే వారితో దోస్తే చేసే పార్టీ ఎంఐంఎ. ఇలాంటి పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పాలి. బీఆర్ఎస్ పాలనలో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ధరణి వల్ల రైతులకు కలిగిన లాభమేంటి? వారికున్న భూమి కూడా వారి పేరిట లేకపోయింది. టీఎస్ పీఎస్సీ లీకేజీలతో నిరుద్యోగ యువతను మోసం చేశారు. బండి సంజయ్ దీనిపై పోరాడాడు. అయినా ప్రభుత్వం స్పందించలేదు. ఇకపైనా ఇలాగే ఉద్యమాలు కొనసాగించాలి. ప్రభుత్వాన్ని గద్దె దించాలి.’ అని కిషన్‌ రెడ్డి అన్నారు.

Exit mobile version