Site icon NTV Telugu

Kishan Reddy : ఢిల్లీ నడిబొడ్డున తెలంగాణ పరువు తీశారు

Kishanreddy

Kishanreddy

కల్వకుంట్ల కుటుంబం ప్రతినిధులు దశల వారీగా ప్రెస్ మీట్‌లు పెడుతున్నారని, మేం నీతి మంతులం అని చెప్తున్నారని విమర్శించారు కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి. తెలంగాణ సమాజం ఢిల్లీలో మద్యం వ్యాపారం చెయ్యమని చెప్పరా అని ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా.. తెలంగాణ ఆడబిడ్డలు మద్యం వ్యాపారం చెయ్యమని అడిగారా అని ఆయన అన్నారు. ఢిల్లీ నడిబొడ్డున తెలంగాణ పరువు తీశారని ఆయన అన్నారు. తల దించుకునేలా చేశారని ఆయన మండిపడ్డారు. అక్రమంగా వ్యాపారం చేసి.. లిక్కర్ వ్యాపారం లో ఎక్కడా కూడా రాజకీయ నాయకురాలి పేరు కనబడలేదని, తెలంగాణలో మద్యం వ్యాపారం ద్వారా.. ప్రజలను అనారోగ్యానికి గురి చేస్తున్నారన్నారు. మద్యాన్ని ప్రధాన అదాయంగా పెట్టుకున్నారని, అన్నా చెల్లెలు ఇద్దరు అబద్దం మాట్లాడారని ఆయన ధ్వజమెత్తారు. మహిళా రిజ్వేషన్ల కోసం ధర్నా చేస్తున్నందుకు ఈడీ నోటీసులు ఇచ్చారని చెప్తున్నారని, మహిళా రిజ్వేషన్ల గురించి అడిగే నైతిక హక్కు ఉందా అని ఆయన ప్రశ్నించారు. మీ ఇంటి పార్టీ అయిన మజ్లిస్ పార్టీని మహిళా బిల్లు కోసం ఒప్పిస్తారా అని ఆయన అన్నారు.

Also Read : IND VS AUS: తొలి రోజు ఆసీస్ దూకుడు.. సెంచరీతో చెలరేగిన ఖవాజా

మహిళా బిల్లును పార్లమెంట్ లో ఎస్పీ, ఆర్జేడీ కదా అడ్డుకుందని, మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కాబట్టే దృష్టి మరల్చేందుకు కొత్త నాటకానికి కల్వకుంట్ల కుటుంబం తెర లేపిందని ఆయన వ్యాఖ్యానించారు. సానుభూతి కోసం చేస్తున్న డ్రామా ఇది అని, రాజ్యసభకు ఒక్క మహిళా ఎంపీని కూడా పంపని బీఆర్ఎస్‌కు రిజర్వేన్లపై మాట్లాడే హక్కు ఉందా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థిక మంత్రిగా తెలుగు ఆడబిడ్డకు మంత్రి వర్గంలో అవకాశం ఇచ్చారని, ఏకాభిప్రాయం వస్తే మహిళల హక్కులు కాపాదాలన్నది మా అభిప్రాయమన్నారు. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు ఒక చట్టం.. సామాన్యులకు ఒక చట్టం ఉంటుందా అని ఆయన అన్నారు. ఈడీ ఎవరిని పిలుస్తోంది.. ఏం చేస్తుంది అనేది మాకు తెలియదని, దేశం కోసం మాకు పని చెయ్యాల్సిన అవసరం ఉందన్నారు.

Also Read : Krithi Shetty: బేబమ్మ కూడా ట్యాలెంట్ చూపిస్తోంది భయ్యో

కల్వకుంట్ల కుటుంబానికి ఉన్న సంపద సరిపోదని, వ్యాపారం చెయ్యమని తెలంగాణ సమాజం చెప్పిందా అని ఆయన అన్నారు. ఢిల్లీలో ఆప్ తో కలిసి లిక్కర్ వ్యాపారం చెయ్యాలని ప్రజలు కొరారా.. అక్రమ వ్యాపారానికి తెలంగాణ సమాజానికి ఎలా లింక్ పెడతారు. మహిళలు చిదరించు కునెలా చేస్తుంది మీరు.. నీతి వంతులు అయితే, ఎందుకు బుజాలు తడుముకుంటున్నారు.. లక్షల రూపాయలు వి సెల్ ఫోన్లను ఎందుకు ద్వంసం చేశారు.. మిమ్మలని టార్గెట్ చెయ్యాల్సిన గొప్ప వాల్లు కాదు.. మీరు వచ్చి అక్రమ వ్యాపారం తో ఇరుక్కున్నారు.. డబ్బులు సంపదించింది మీరు.. వ్యక్తిగతంగా టార్గెట్ చెయ్యాల్సిన అవసరం లేదు.. మాకు ఎవరిపై వివక్ష లేదు.. తెలంగాణ లో మీకు వ్యతిరేకత మొదలు అయింది..’ అని కిషన్‌ రెడ్డి అన్నారు.

Exit mobile version