Site icon NTV Telugu

Kishan Reddy: మోడీకి ప్రత్యామ్నాయం లేదు..

Kishan Reddy

Kishan Reddy

Kishan Reddy: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సికింద్రాబాద్‌ పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లపై తన వ్యంగాస్త్రాలతో మాటల దాడికి దిగుతున్నారు. బీజేపీకి ఓటేసి తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. దేశంలో మోడీకి ప్రత్యామ్నాయం లేదని.. ఏ పార్టీ కూడా మోడీకి ప్రత్యామ్నాయం కాదన్నారు. ఏ ఇంట్లో చూసినా.. ఎవరి నోట విన్న ఒక్కటే మాట మోడీ మోడీ అని ఆయన పేర్కొన్నారు.

Read Also: AP SSC 10th Results 2024: టెన్త్‌ ఫలితాల్లో 86.69 శాతం ఉత్తీర్ణత.. బాలికలదే పై చేయి..

దేశంలో మాఫీయా లేదు.. గుండాయిజం లేదు.. మోడీ వచ్చాక దేశం శాంతియుతంగా ఉందన్నారు. దేశం మోడీ చేతిలో ఉంటేనే భద్రంగా ఉంటుందన్నారు. మోడీ ఒక్కసారి కూడా సెలవు తీసుకోలేదని.. మోడీ ప్రధాని అయినప్పుడే.. కేసీఆర్ కూడా ముఖ్యమంత్రి అయ్యాడన్నారు. కేసీఆర్ ఒక్కరోజు కూడా ఆఫీస్ కు రాలేదని ఆయన విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ మొత్తం ఫాం హౌజ్‌లోనే ఉన్నాడని.. కేసీఆర్ ఒక విచిత్రమైన జంతువు.. ఎప్పుడు బయటకు వస్తాడో తెలియదని కిషన్‌ రెడ్డి తీవ్రంగా వ్యాఖ్యానించారు.

Exit mobile version