NTV Telugu Site icon

Kishan Reddy : చాలా మంది రైతులకు రుణ మాఫీ జరగలేదు

G. Kishanreddy

G. Kishanreddy

చాలా మంది రైతులకు రుణ మాఫీ జరగలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. మండలాల వారీగా, గ్రామాల వారీగా ప్రజలకి , రైతులకు సీఎం ,కాంగ్రెస్ ప్రభుత్వం వివరణ ఇవ్వాలని, ఎందుకు రుణమాఫీ కాలేదో చెప్పాలని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. భవిష్యత్ లో చాలా మంది రైతులకు బ్యాంక్ లు రుణాలిచ్చే పరిస్థితి లేదని కిషన్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. లక్షలాది రూపాయలతో రేవంత్ రెడ్డి ప్రచారం చేసుకుంటున్నారు… వేలాది లీటరు లతో పాలాభిషేకం చేయించుకుంటున్నారని, కౌలు రైతులకు, రైతు కూలీలకు డబ్బులు ఇస్తామని చెప్పారని ఆయన అన్నారు. రైతులకు పంట బొనస్ ఇవ్వలేదని, ప్రజలను మోసం చేయడం కాంగ్రెస్ పార్టీ నైజం… ఆ పార్టీ కి వెన్నతో పెట్టిన విద్య అని ఆయన కాంగ్రెస్‌ పార్టీపై విమర్శలు గుప్పించారు.

Andhra Pradesh: ఏపీలో ప్రజలకు గుడ్‌న్యూస్.. రైతు బజార్లలో తక్కువ ధరలకే సరుకులు

బీఆర్‌ఎస్‌ రైతులను వెన్నుపోటు పొడిచింది.. ఫలితం అనుభవించిందని, రైతులు కాంగ్రెస్ పార్టీ నీ ప్రశ్నించాలి… కంటి తుడుపు చర్యగా, నామ మాత్రంగా ఈ ప్రభుత్వం రుణమాఫీ చేస్తోందన్నారు కిషన్‌ రెడ్డి. సోనియా గాంధీ ప్రతి ఇంటికి లెటర్ పంపించింది… ఇప్పుడు 6 గ్యారంటీ ల అమలులో ఎందుకు చొరవ చూపడం లేదని, బడ్జెట్ మసి పూసి మారేడు కాయ చేసేలా ఉందన్నారు కిషన్‌ రెడ్డి. రైతుకు, మహిళలకు, యువతకు, బీసీ లకు వెన్నుపోటు … మోసం చేసిందని, ఎస్సీ,ఎస్టీ, బీసీ మైనారిటీ ల బడ్జెట్ ను తగ్గించారన్నారు. బడ్జెట్ లో గాలి లెక్కలు, నీటి మీద రాతలు అని కిషన్‌ రెడ్డి విమర్శించారు.

CM Chandrababu: మదనపల్లి ఫైల్స్ ఘటనపై సీఎం చంద్రబాబును కలిసిన సీపీఐ బృందం