NTV Telugu Site icon

Kishan Reddy : తెలంగాణలో జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి

Kishan Reddy

Kishan Reddy

మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతుందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. వరంగల్‌లో ఇవాళ ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా భారతదేశాన్ని మోడీ నిలిపారన్నారు. 400 సీట్లు NDA కు వచ్చే వాతావరణం ఉందని, మంచి మెజార్టీతో ఎంపీగా ఆరూరి రమేష్ గెలవబోతున్నారని ఆయన జోస్యం చెప్పారు. తెలంగాణలో కూడా బీజేపీ బలపడాల్సిన అవసరం ఉందని, తెలంగాణలో జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి అని కిషన్‌ రెడ్డి అన్నారు. హమీలు నెరవేర్చలేని ప్రభుత్వంగా తెలంగాణ ప్రభుత్వం ఉందని, బ్యాంకుల నుండి అప్పులు తీసుకోని రుణ మాఫీకీ కాంగ్రెస్ ప్లాన్ చేస్తుందన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం తెలంగాణను కాంగ్రెస్-బీఆర్ఎస్ దగా చేస్తున్నాయని, తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఆగమ్యగోచరంగా మారే పరిస్థితులు ఉన్నాయని ఆయ పేర్కొన్నారు. భవిష్యత్తు లో తెలంగాణ ను రక్షించుకునే భాద్యత బీజేపీ తీసుకుంటుందని, బీజేపీ MLC అభ్యర్థి ప్రేమెందర్ రెడ్డికి అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు కిషన్‌ రెడ్డి.

అంతేకాకుండా..’బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి క్యూ కడుతున్నారు. తెలంగాణ భవన్ బాగాలేదని ఎమ్మెల్యేలను గాంధీభవన్ కు పంపించి ఏ మొఖం పెట్టుకొని ఓటు అడుగుతున్నారు. బీఆర్ఎస్- కాంగ్రెస్ రెండు ఒక్కటే…రెండు పార్టీల DNA ఒక్కటే. బీఆర్ఎస్- కాంగ్రెస్ ప్రజల కోసం రాజకీయాల్లోకి రాలేదు..స్వంత ప్రయోజనాల కోసం రాజకీయాల్లోకి వచ్చారు. నా మీద పోటీ చేసిన దానం నాగేందర్ ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే. కానీ ఇప్పుడు పోటీ చేసింది కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా.. చేతి గుర్తుపై పోటీ చేశారు. దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్యాలి. పార్టీ ఫిరాయింపులపై,ఆర్థిక పరిస్థితి పై మేదావులు ఆలోచన చెయ్యాలి. తెలంగాణ సమాజం బీజేపీ కీ అండగా ఉండాల్సిన అవసరం ఉంది. బీజేపీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేయదు’ అని కిషన్ రెడ్డి అన్నారు.