Site icon NTV Telugu

Kishan Reddy : బీజేపీకి ఈ కారణంగానే ఎక్కువ ఓట్లు వచ్చాయి

Kishan Reddy

Kishan Reddy

బీజేపీకి అనుకూలంగా అనూహ్య ఫలితాలు రానున్నాయని తెలంగాణ బీజేపీ చీఫ్‌, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అందరినీ ఆశ్చర్యపరిచే ఫలితాలు ఉంటాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మా పై తప్పుడు ప్రచారం చేశారని, మజ్లిస్ పార్టీ సూట్ కేసులు తీసుకుని కాంగ్రెస్, బీఆరెస్ అభ్యర్థులకు మద్దతు ఇచ్చారని ఆయన ఆరోపించారు. బీజేపీకి ఈ కారణంగానే ఎక్కువ ఓట్లు వచ్చాయన్నారు. మహిళలు, యువత పెద్ద ఎత్తున బీజేపీకి మద్దతుగా ఓటు వేశారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం కనబడుతోందని, కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు బీజేపీ సరైన ప్రత్యామ్నాయంగా అవతరించబోతోందని ఆయన వ్యాఖ్యానించారు.
Perni Nani: పోలింగ్ తర్వాత హింసకు వారే కారణం.. పక్కా ప్లాన్‌ ప్రకారమే దాడులు..!

బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అస్తిత్వం కోల్పోనుందని, ప్రజలు బీజేపీకి ఏకపక్షంగా మద్దతు తెలిపారన్నారు. తెలంగాణలో ఆర్థిక సంక్షోభం ఏర్పడే పరిస్థితులున్నాయని, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తెలంగాణ భవిష్యత్తు గురించి ఆలోచించకుండా అనవసర ఖర్చులు చాలా చేశాయని ఆయన అన్నారు. డిసెంబర్‌ 9న రైతు రుణమాఫీ చేస్తామని మాట తప్పారు, ఇప్పటికైనా సీఎ రేవంత్‌ రెడ్డి అబద్ధాలు మానుకోవాలని హితవు పలికారు. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ గడ్డుకాలంలో ఉందన్నారు. అడుగడుగునా హామీలపై కాంగ్రెస్‌ను నిలదీస్తామని చెప్పారు. రేవంత్ పాలన మొదలుపెట్టకుండానే పరీక్ష అంటున్నారని, వచ్చే ఎన్నికల్లో వ్యతిరేక ఫలితాలు వస్తే రేవంత్ ఏం చేస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం వచ్చిందన్నారు.

Swati Maliwal: దాడి ఘటనలో స్వాతి మలివాల్‌తో ఆప్ సెటిల్‌మెంట్..?

Exit mobile version