NTV Telugu Site icon

Kishan Reddy : కేసీఆర్‌ అసెంబ్లీకి అర్థం లేకుండా చేశారు

Kishan Reddy

Kishan Reddy

విపత్తు నిర్వహణ కింద రాష్ట్ర ప్రభుత్వం దగ్గర 988 కోట్లు సిద్దంగా ఉన్నాయని, ఇందులో 75 శాతం కేంద్ర ప్రభుత్వ నిధులే అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఆయన ఎన్టీవీతో మాట్లాడుతూ.. వాటిని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయొచ్చని, ఈ నిధుల నుండే మరణించిన వారికి నాలుగు లక్ష రూపాయల నష్ట పరిహారమన్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి 193 కోట్లు కేంద్రం విడుదల చేయాల్సి ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం యూసీ సర్టిఫికెట్ ఇవ్వక పోవడంతో ఆ నిధులు ఆగిపోయాయన్నారు. ఎల్లుండి వరంగల్ కి వెళ్తున్నానని, బీజేపీ కార్యాలయాల్లో భోజన వసతి, ఉండేందుకు సౌకర్యం కల్పించాలని ఆదేశాలు ఇచ్చామన్నారు.

Also Read : Online Love Story: ప్రియుడిని పెళ్లాడేందుకు చైనా నుంచి పాకిస్థాన్‌కు.. సరిహద్దు దాటిన మరో ప్రియురాలు

ఈ ప్రభుత్వం అసెంబ్లీ నడిపిస్తే కదా ఫ్లోర్ లీడర్ ఆ ఇంకో లీడర్ ఆ నిర్ణయించేదని ఆయన విమర్శలు గుప్పించారు. కేసీఆర్ అసెంబ్లీ కి అర్థం లేకుండా చేశారని ఆయన మండిపడ్డారు. రేపు ఢిల్లీకి వెళ్తున్నట్లు ఆయన వెల్లడించారు. 10 ఎన్డీఆర్‌ఎఫ్‌ టీమ్ లు ఫీల్డ్ లో ఉన్నాయని, 2 ఆర్మీ హెలికాప్టర్ లు అందుబాటు లో ఉన్నాయన్నారు కిషన్‌ రెడ్డి. నేను బాట సింగారం వెళ్తా నంటే నన్ను మా వాళ్ళను అరెస్ట్ చేశారని ఆయన ధ్వజమెత్తారు. ఈ రోజు గ్రేటర్ మునిసిపల్ కార్యాలయం ముందు కాంగ్రెస్ ఆందోళన కి పూర్తిగా సహకరించింది ఎవరు అని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు ఎవరు ఎవరితో కలిశారని, బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒకటి అని అంటున్న మేధావులు చెప్పాలన్నారు. మేము ఏమో కోర్ట్ కి వెళ్లి పర్మిషన్ తెచ్చుకోవాలని.. కాంగ్రెస్‌ నేతలకు అవసరం లేకుండానే ఆందోళనలు చేపడుతున్నారన్నారు.

Also Read : Shreya Dhanwanthary: రెచ్చిపోయిన తెలుగమ్మాయి.. ఒంటిపై నూలుపోగు లేకుండా ఫోజులు!