Site icon NTV Telugu

Kishan Reddy : కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు అభ్యర్థులు దొరకడం లేదు

Kishan Reddy

Kishan Reddy

బీజేపీ కిసాన్ మోర్చా సమావేశం లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు అభ్యర్థులు దొరకడం లేదన్నారు. టికెట్లు ఇచ్చిన పోటీ చేయమని వెనక్కి తగ్గుతున్నారని, మోడీకి వ్యతిరేకంగా పోటీ చేయాలంటే భయపడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ నుండి 50 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని, బాయిల్డ్ రైస్ కొనాలని మోడీని కోరితే ఓకే చెప్పారన్నారు కిషన్ రెడ్డి. ఈనెల ఒకటి నుండి తెలంగాణలో ధాన్యం కొనుగోలను కేంద్రము ప్రారంభిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. రైతులను గత ప్రభుత్వం మోసం చేసింది అదే బాటలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుందని, ధాన్యం కి బోనస్ ఇస్తామన్నారు ఎప్పుడు ఇస్తారో చెప్పాలన్నారు కిషన్‌ రెడ్డి. 70 లక్షల టన్నుల ధాన్యం కొంటామని కేంద్రానికి ఈ ప్రభుత్వం చెప్పింది.. ప్రతి క్వింటాల్ కి 500 బోనస్ ఇవ్వాలని, ఎకరానికి 15వేలు రైతు భరోసా ఇవ్వాలి కౌలు రైతులను ఆదుకోవాలన్నారు.

అంతేకాకుండా..’కరువుతో పంటలు ఎండిపోతున్నాయి వెంటనే సర్కార్ స్పందించాలి…. ప్రభుత్వ వైఖరి ఏంటో చెప్పాలి. సాగు తాగు నీటి ఎద్దడి మొదలైంది. పశువులకు తాగునీరు దొరకని పరిస్థితి వచ్చింది. కరువు నుండి ప్రజలను ఏ విధంగా గట్టు ఎక్కిస్తారో ,ఎలాంటి కరువు సహాయక చర్యలు తీసుకుంటారో ప్రభుత్వం చెప్పాలి. బీజేపీ రైతులకు అండగా ఉంటుంది రైతులు సంక్షేమంగా ఉండాలంటే కేంద్రంలో బిజెపి అధికారంలో ఉండాలి. తెలంగాణలో 17 కు 17 సీట్లు బీజేపీ గెలవాలి.’ అని ఆయన వ్యాఖ్యానించారు.

Exit mobile version