కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ‘ఛలో బాట సింగారం’ కార్యక్రమం తలపెట్టిన విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. పేదలకోసం గొప్పగా కట్టామని చెబుతున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను చూడడానికి వెళ్తుంటే బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉలికిపాటెందుకు? అని ప్రశ్నించారు. ఇదేమైనా ఉద్యమమా? లేక తిరుగుబాటా? అని ఆయన మండిపడ్డారు. కేవలం ఇండ్లు చూడడానికి వెళ్తుంటే భయమెందుకని, ఇప్పుడే యుద్ధం ప్రారంభమైంది. బీఆర్ఎస్ ను గద్దెదించే వరకు ఈ ఉద్యమం ఆగదని ఆయన స్పష్టం చేశారు.
Also Read : Urusa Javed: ఏం ఉర్ఫీ నువ్వే అనుకుంటే.. నీ చెల్లి నిన్ను మించి చూపిస్తుందిగా..
హౌస్ అరెస్ట్ లు అక్రమ అరెస్టులు బీఆర్‌ఎస్ ప్రభుత్వ నిరంకుశత్వనికి పరాకాష్ట అని ఆయన ధ్వజమెత్తారు. గొప్పగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మిస్తే ఈ అక్రమ అరెస్టులెందుకని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బాటసింగరంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్మిస్తున్న డబల్ బెడ్ రూమ్ ఇళ్లను చూసేందుకు పరిశీలించేందుకు వెళ్తున్న బీజేపీ నేతల అక్రమ అరెస్ట్ లను కిషన్ రెడ్డి ఖండించారు. బీజేపీ నేతలను ముందస్తు అరెస్ట్ లు చేయడం గృహానిర్బంధం చేయడం దుర్మార్గమని, 2ఏళ్ళల్లో ప్రగతి భవన్ నిర్మించుకున్న కేసీఆర్ 9 ఏళ్ళైన పేదల డబల్ బెడ్ రూమ్ ల నిర్మాణం మాత్రం జరగలేదంటే పేదలపట్ల బీఆర్‌ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధి ఏంటో అర్ధం అవుతుందని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఈటల రాజేందర్, డీకే అరుణలతో పాటు పలువురు బీజేపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు.
Also Read : Monsoon Session: నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. మణిపూర్ హింసపైనే విపక్షాల ఫోకస్
