NTV Telugu Site icon

Kishan Reddy: మూడో సారి మళ్లీ మోడీనే ప్రధాని కాబోతున్నారు..

Kishanreddy

Kishanreddy

Kishan Reddy: ఈ ఎన్నికలు తెలంగాణకో.. సికింద్రాబాద్ కో సంబంధించినవి కావు.. దేశం కోసం జరిగే ఎన్నికలు ఇవి అని సికింద్రాబాద్ బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఓపెన్ టాప్ జీప్ పైన గల్లీ టూ గల్లీ కిషన్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు. మధ్యాహ్నం వరకు తార్నాక, మెట్టుగూడ డివిజన్లలో ప్రచారం నిర్వహించనున్నారు. కరోనా వచ్చినప్పుడు మన ప్రాణాలు కాపాడిన మహానుభావుడు మోడీ అని.. కరోనా సమయంలో ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చారన్నారు. కరోనా సమయంలో నుంచి ఈరోజు వరకు ఉచిత బియ్యం ఇచ్చారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

డిపాజిట్స్ లేకుండా పొదుపు సంఘాలకు 20లక్షల రుణాలు ఇచ్చాం.. మళ్లీ ఇవ్వబోతున్నామని ఆయన తెలిపారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించామన్నారు. ముస్లిం బిడ్డలకు మోడీ అండగా నిలిచి.. ట్రిపుల్ తలాక్ రద్దు చేశారని.. ముస్లిం ఆడబిడ్డల మీద కత్తిలాగా ట్రిపుల్ తలాక్ ఉండేదన్నారు. మళ్లీ ముస్లిం మహిళలను ప్రమాదంలోకి నెట్టాలని కాంగ్రెస్ చూస్తోందని ఆయన ఆరోపించారు. 500 ఏళ్ల నుంచి రామ జన్మభూమి నిర్మాణం హిందువుల కల ఉండేదని.. మోడీ హయాంలోనే రామ మందిర నిర్మాణం సాకారం అయ్యిందన్నారు. ఎయిర్‌పోర్టులు, వ్యవసాయ రంగం, రైల్వే ఇలా ప్రతి రంగం అభివృద్ధి చెందిందన్నారు కిషన్ రెడ్డి.

చిన్న చిన్న వ్యాపారులు చేసుకునే వారికి మోడీ లోన్స్ ఇస్తున్నారని.. దేశాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి.. ప్రపంచంలో దేశ గౌరవాన్ని పెంచారని చెప్పారు. మూడో సారి మళ్లీ మోడీనే ప్రధాని కాబోతున్నారని సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.