NTV Telugu Site icon

Kishan Reddy : రైతుబంధు ఇవ్వడంలేదు.. రైతుబంధు ఉందో, లేదో తెలియదు

Kishanreddy

Kishanreddy

Kishan Reddy : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలవుతోంది పూర్తిగా పాలన గాడి తప్పింది ఆర్థిక వ్యవస్థ గందరగోళంగా ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇవాళ బీజేపీ రాష్ట్ర కార్యాలయం లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర లక్ష్య సాధన అంశాలు కాంగ్రెస్ తోనే సాధ్యమని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి అనేక ప్రగల్బాలు పలికి గద్దేనెక్కి ఇచ్చిన హామీలను అమలు చేయకుండా తెలంగాణ ప్రజల ఆకాంక్షలను వమ్ము చేసారని, 10నెలల కాంగ్రెస్ 10ఏళ్ల బీఆరెస్ పాలన దొందు దొందే రెండు పార్టీల పాలన ఒక్కటే అని ఆయన అన్నారు. గురుకుల పాఠశాలలకు రెంట్​ ఇవ్వలేని పరిస్థితుల్లో కాంగ్రెస్​ ఉంది. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లుగా కాంగ్రెస్​ పరిస్థితి ఉందన్నారు. రూ. 5, రూ. 10 లక్షల కాంట్రాక్టర్లకు బకాయిలు చెల్లించలేని, వీధి లైట్లు సరిచేసే కార్మికులకు జీతాలు ఇవ్వలేని, కొత్త వీధిలైట్లను నిధులివ్వలేని పరిస్థితిలో కాంగ్రెస్​ ప్రభుత్వం ఉందన్నారు. రూ. 2500 మహిళలకు హామీ రాలేదని, పెళ్లి చేసుకుంటే తులం బంగారం ఇవ్వలేదన్నారు కిషన్‌ రెడ్డి. కాలేజీ విద్యార్థులకు స్కూటీలు సంస్థలకు ఆర్డర్​ ఇవ్వలేదని, వితంతు, విద్యార్థులు, దివ్యాంగులు, ఒంటరి మహిళల పెన్షన్​ పెంచలేదని ఆయన మండిపడ్డారు. విద్యార్థులకు ఇస్తున్న రూ. 5 లక్షల భరోసా కార్డు, యువతకు నిరుద్యోగ భృతి సీఎం ఆలోచన చేయలేదన్నారు.

అంతేకాకుండా..’రైతు బంధు రాబంధుల పాలైంది. కౌలు రైతులకు ఇస్తామన్న రూ. 15వేలు కౌలుకే ఇచ్చారని విమర్శించారు. విద్యార్థుల మెస్​ చార్జీల పెంపుపై అతీగతీ లేదు. దళితబంధు ఉన్నదా? ఊడిందా? తెలీదు.. బీసీ బంధు ఎవ్వరూ ఎత్తుకెళ్లారో తెలియదు. ఏ ఒక్క హామీ కూడా ఈ ప్రభుత్వం అమలు చేసే పరిస్థితి లేదు. ఇవన్నీ వదిలేసి మూసీ ప్రక్షాళనకు లక్షా యాభై వేట్ల కోట్లని ఎగిరెగిరి పడుతున్నారని విమర్శించారు. ముందుగా రాష్ర్ట ఆర్థిక పరిస్థితి ఏంటో చెప్పాలన్నారు. బీఆర్​ఎస్​ హయాంలో చేసిన అప్పులు.. ఈ పది నెలల్లో అస్సలు ఎంత? వడ్డీ ఎంత చెల్లించారో చెప్పాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్​ ప్రభుత్వం వచ్చాక నూతన అప్పులెంత? బీఆర్​ఎస్​ సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయా? ఊడబీకారా? ఎన్ని పథకాలున్నాయి? ఎన్ని రద్దు చేశారు? కాంగ్రెస్​ హయాంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల పరిస్థితి ఏంటీ? వీటికి ఎంత ఖర్చు అవుతుంది? మిగతా ప్రభుత్వ ఖర్చులెంత, అభివృద్ధి పనులకెంత, రోడ్లు, పాఠశాలలు, హాస్టల్​స్​ నిర్మాణం, వంటివిషయాలు ఎలా అమలు చేస్తారు? దళితులు, మైనార్టీలు, యువత, రైతాంగంపై ప్రవేశపెట్టిన ప్రత్యేక కార్యక్రమాల నివేదిక ఏంటని నిలదీశారు?

Samyuktha Menon: “బ్రెస్ట్ క్యాన్సర్‌ అవేర్‌నెస్‌లో భాగమవుదాం”..హీరోయిన్ సంయుక్త పిలుపు

ఏ రకంగా ఆర్థిక వనరులు సమకూర్చుకుంటారు? ఏయే భూములు అమ్మాలనుకుంటున్నారు? మూసీలో భూములు ఎంతమేర అమ్ముతారు? లేదా ఆక్రమించుకుంటారా? ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ర్ట ఆర్థిక పరిస్థితి గందరగోళంలో ఉందన్నారు. గతంలో బీఆర్​ఎస్​ ఆర్థిక పరిస్థితి భ్రష్టు పట్టించిందన్నారు. కాళేశ్వరం పేరుతో దోపిడీ చేస్తే కాంగ్రెస్​ సీఎం రేవంత్​ రెడ్డి పది నెలల కాలంలో రియల్​ ఎస్టేట్​ కుప్పకూలిందన్నారు. రిజిస్ర్టేషన్లు నిలిచిపోయాయన్నారు. ఫ్లాట్లు, ప్లాట్లు కొనే పరిస్థితి లేదన్నారు. పరిశ్రమల స్థాపన ఆగిపోయిందన్నారు. 10 నెలల్లో జరిగిన ఒప్పందాలు, అప్పులపైన, ప్రభుత్వ స్థిరాస్తులపైన, రాష్​ర్ట ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని బీజేపీ డిమాండ్​ చేస్తున్నామని కేంద్రమంత్రి జి.కిషన్​ రెడ్డి అన్నారు. ప్రజలకు ఈ విషయాలన్నీ తెలియాల్సిన అవసరం ఉందన్నారు. దున్నపోతు ఈనిందంటే తాడు తెమ్మాన్నాడంటా? ఆలు లేదు చూలు లేదు నల్గొండకు నీరు వచ్చినట్లు అక్కడి రైతులను రెచ్చగొట్టారన్నారు. మూసీ సుందరీకరణకు బీజేపీ వ్యతిరేకం కాదు. అన్ని రకాలుగా సాకారం అందిస్తామన్నారు. మూసీకి రిటైనింగ్​ వాల్​ కట్టి కృష్ణా, గోదావరి, అనంతగిరిలో పుట్టించి నీరు తీసుకువస్తారా? అని ప్రశ్నించారు. ఈ పనికి ప్రతీఒక్కరూ స్వాగతం పలుకుతారని అన్నారు.

కాంగ్రెస్​ పార్టీ నాయకులు సిగ్గులేకుండా రైతులను, ప్రజలను రెచ్చగొట్టే చర్యలకు దిగుతుందన్నారు. ఇంతవరకు డీపీఆర్​, ఆర్థిక ఒప్పందాలు, సరైన ప్రణాళిక లేదన్నారు. ఇళ్లు కూలగొట్టినందుకే బీజేపీ వ్యతిరేకించిందన్నారు. మూసీ ప్రక్షాళనకు కార్యకర్తలంతా కూలీలతోపాటు కలిసిపనిచేస్తామన్నారు. సీఎం రేవంత్​ రెడ్డి వైఫల్యం, చేతగానీ తనం, దుందుడుకు విధానం ప్రజలు అర్థం చేసుకోరని అనుకుంటే తప్పన్నారు. ఇప్పటికైనా రాష్​ర్ట ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టండి. తెలంగాణ​ అవతరణకు పార్లమెంట్​ లో బీజేపీ కీలక పాత్ర వహించిందన్నారు. గతంలో బీఆర్​ఎస్​, ప్రస్తుతం కాంగ్రెస్​ నాయకులు సామూహికంగా దోచుకుంటుందన్నారు. మిగులు బడ్జెట్​ ఉన్న తెలంగాణను ఇద్దరూ కలిసి భ్రష్టు పట్టిందన్నారు. తెలంగాణను రక్షించుకోవాలసిన బాధ్యత ప్రజలపై, బీజేపీపై ఉందన్నారు. ఇందుకోసం బీజేపీ అన్నిరకాల పోరాటాలకు సిద్ధమవుతుందన్నారు.

ఆయుష్​మాన్​ భారత్​, పంటల బీమా లాంటి కేంద్ర పథకాలు ఏ రకంగా అమలు చేయబోతున్నారో? ఆరు గ్యారంటీలు ఏ రకంగా అమలు చేస్తారో? సమగ్రంగా శ్వేతపత్రం ప్రకటించాలని బీజేపీ డిమాండ్​ చేస్తుందన్నారు. పదేళ్లు కేసీఆర్​ తెలంగాణ కు అన్యాయం జరుగుతుందని మాట్లాడారని అన్నారు. అదే పల్లవిని సీఎం రేవంత్​ రెడ్డి ఎత్తుకున్నారని అన్నారు. బీజేపీ వచ్చాక రాష్ర్టాలకు ఇచ్చే నిధుల పద్ధతిని పాటిస్తున్నామని తెలిపారు. రివల్యూషనరీ ఫండ్​ ను 32 నుంచి 42 శాతానికి పెంచామన్నారు. సిద్ధిపేట, గజ్వెల్​, భూపాలపల్లి, ఆసిఫాబాద్​ కు ఎంత ఇచ్చారో? హరీష్​ రావు చెప్పాలని కిషన్​ రెడ్డి డిమాండ్​ చేశారు. దేశంలోని ఏ రాష్​ర్టమైనా కేంద్ర ప్రభుత్వం అదే విధానాన్ని అమలు చేస్తుంది తప్ప ఆ పాలసీని మార్చలేదని కేంద్రమంత్రి జి.కిషన్​ రెడ్డి అన్నారు.

Gold Prices: ఏడాదిలో 35 సార్లు ఆల్ టైమ్ హైకి చేరుకున్న బంగారం ధర..