NTV Telugu Site icon

Kishan Reddy: ఆయన సర్వేల్లో ఓడిపోతానని తెలిసి కామారెడ్డి వస్తున్నాడు

Kishan Reddy

Kishan Reddy

కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి పర్యటించారు. పొందుర్తి వద్ద ఆయనకు బీజేపీ శ్రేణులు భారీగా బైక్ ర్యాలీతో స్వాగతం పలికారు. అనంతరం రాజారెడ్డి గార్డెన్లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లక్ష 20 వేల కోట్లు పెట్టి కాళేశ్వరం కడితే కుంగిపోతుందని విమర్శించారు. 80 వేల కోట్ల రూపాయల అప్పు తెచ్చాడు.. కాళేశ్వరం కూలిపోయే పరిస్థితి వచ్చిందని తెలిపారు. కాళేశ్వరం ప్రశ్నార్థకం అవుతుంది కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

Asaduddin Owaisi: బాబ్రీ కూల్చివేతలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ లాగే కాంగ్రెస్ పాత్ర కూడా ఉంది..

పదేళ్ళలో సీఎం కేసీఆర్ గజ్వేల్ లో ప్రజలను ఒక్కసారి కూడా కలవలేదని కిషన్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ చేసుకున్న సర్వేల్లో ఓడిపోతానని తెలిసి కామారెడ్డి వస్తున్నాడని విమర్శించారు. తెలంగాణ భవిష్యత్తు కామారెడ్డి చేతిలో ఉందని.. 5 లక్షల కోట్లు అప్పు చేసిన కేసీఆర్ ను ఓడించాలన్నారు. కేసీఆర్ పోవాలి.. రైతు ప్రభుత్వం రావాలని కిషన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ఇక్కడికి వచ్చి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా.. ఇక్కడి ప్రజలు అమ్ముడుపోయేవాళ్ళు కాదని ఆయన తెలిపారు. కేసీఆర్ కు ప్రజల మీద, ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదని చెప్పారు. తెలంగాణలో కామారెడ్డి నుంచే మార్పు రావాలని కిషన్ రెడ్డి తెలిపారు.

Rakul Preeth Singh: ఓమైగాడ్ అనిపిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ బ్లాక్ డ్రెస్ ఫొటోలు

సీఎం కేసీఆర్ పై పోటీకి ఈటల రాజేందర్ గజ్వేల్ వెళ్ళాడు.. అందుకే కేసీఆర్ కు వణుకుపుట్టిందని కిషన్ రెడ్డి అన్నారు. రెండింటిలో ఒకచోట అయినా గెలుస్తానో లేదో అని కేసీఆర్ కు భయం పట్టుకుందని విమర్శించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు కేసీఆర్ డబ్బులిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ బాగుపడాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని కిషన్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ అంటే దరిద్రం, శని.. ఆ శని తెలంగాణ నెత్తిమీద పెట్టుకుంటే ప్రజలు ఆగం అవుతారని బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు.