కాంగ్రెస్ దిగజారి ప్రకటనలు చేస్తుందని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ వారసత్వాన్ని కొనసాగిస్తుందని, ఇటలీకి చెందిన సోనియా గాంధీని దేశ ప్రధాని చేయాలని చూశారన్నారు. మా పార్టీ సోనియా ప్రధాని కావడాన్ని అడ్డుకుందని ఆయన వ్యాఖ్యానించారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాదు ఇటలీ నేషనల్ కాంగ్రెస్ పార్టీగా కాంగ్రెస్ మారిందని ఆయన విమర్శించారు. ఎన్నికల వ్యవస్థ నిర్వీర్యం చేసింది కాంగ్రెస్ అని, దేశానికి పట్టిన దరిద్రం కాంగ్రెస్.. పదేళ్ల క్రితం ఇటలీ కాంగ్రెస్ ను దేశ ప్రజలు వదులుకున్నారన్నారు కిషన్ రెడ్డి. దేశ ప్రజలు ఈ దరిద్రాన్ని మళ్లీ దరికి చేరనివ్వరని ఆయన అన్నారు. బీజేపీ వస్తే రిజర్వేషన్లు ఉండవని పిచ్చి వాదనలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని, కాంగ్రెస్ బ్రిటిష్ సంప్రదాయాలను కొనసాగిస్తుందన్నారు కిషన్ రెడ్డి. దేశాన్ని విభజించు, పాలించు విధానాన్ని అవలంభిస్తుంది కాంగ్రెస్ పార్టీ అని, కాంగ్రెస్ వాళ్లు ఇటలీ కోసం పుట్టారు.. ఇటలీ కోసమే చస్తారన్నారు.
అంతేకాకుండా..’ముస్లీం రిజర్వేషన్స్ ను ఏ ప్రాతిపాదికనా తీసుకువచ్చారు.. రాజ్యాంగాన్ని అవమానపరిచి.. జమ్మూ కాశ్మీర్ లో జిన్నా రాజ్యాంగాన్ని నడిపించారు.. బీజేపీ రిజర్వేషన్స్ తొలగిస్తుందని చెబితే నమ్మే వారు దేశంలో లేరు.. తప్పుడు ప్రచారాలతో కుట్ర పూరితంగా కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది.. తెలంగాణలో బీసీల రిజర్వేషన్స్ కు ఎవరు గండీ కొడుతున్నారో రేవంత్ రెడ్డి చెప్పాలి.. రాహుల్ గాంధీని ప్రశ్నిస్తున్న.. బీసీ రిజర్వేషన్స్ పేరుతో అన్యాయం జరగుతుందా కాదా చెప్పాలి.. తెలంగాణలో రిజర్వేషన్స్ పేరుతో తప్పుడు మాటలు చెబుతున్నారు.. మదమెక్కి మాట్లాడుతున్నారా.? GHMC లో దాదాపు 50 సీట్లు బీసీలకు ఇవ్వాలి.. అందులో 30 ఇచ్చారు.. మిగతా ఎంఐఎం పార్టీ తొత్తులకు ఇచ్చారు.. దమ్ము ధైర్యం ఉంటే.. ముస్లీం రిజ్వరేషన్స్ రద్దు చెయ్యు రేవంత్.. బీసీ సీట్లలో ముస్లీంలకు సీట్లు ఇస్తూ.. బీసీలను అణగదొక్కుతున్నారు..
మీకు మా పార్టీ గురించి మాట్లాడే హక్కు ఉందా.. మీది ఇటలీ కాంగ్రెస్.. మాది పక్కా లోకల్ పార్టీ.. నోటికి ఏదొస్తే అది మాట్లాడితే చూస్తూ కూర్చుంటాం అనుకుంటున్నారా? కాంగ్రెస్ పార్టీ కనుచూపు మేరలో కూడా అధికారంలోకి వచ్చే అవకాశం లేదు.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశాన్ని మతపరమైన శక్తులకు, విదేశీ శక్తులకు పెద్దపీఠ వేస్తారు.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న దగ్గర కూడా కాంగ్రెస్ మీద ఎక్కడ ఆశ లేదు.. అంబేద్కర్ రాజ్యాంగాన్ని పటిష్టం చేశాం.. అంబేడ్కర్ ను బ్రతికి ఉన్నప్పుడు అవమానించారు.. చనిపోయాక కూడా అవమానించారు.. అంబేడ్కర్ కు భారతరత్న ఇవ్వడానికి బీజేపీనే కారణం.. పీవీ నరసింహారావు శవాన్ని పార్టీ ఆఫీస్ దగ్గరికి రానివ్వకుండా చేశారు సోనియా.. దివంగత ప్రధానులు అందరికీ ఢిల్లీలో ఘాట్ లు ఉన్నాయి.. కానీ పీవీకి లేదు.. మీరు అవమానించిన పీవీకి మేము భారతరత్నతో గౌరవించాం.. మాది రిజ్వరేషన్స్ తీసే పార్టీ కాదు.. రిజర్వేషన్స్ కల్పించే పార్టీ.. నిజంగా ఛార్జ్ షీట్ తీయాలంటే కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలపైన ఛార్జ్ షీట్ తీయాలి.. ముస్లీం రిజర్వేషన్స్ బారాబర్ తీసేస్తాం.. మతపరమైన రిజర్వేషన్స్ రాజ్యాంగ విరుద్ధం అని హై కోర్ట్ తీర్పు ఇచ్చింది.. హై కోర్ట్ చెంపపెట్టులాంటి తీర్పు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి సిగ్గు లేదు.. హై కోర్ట్ తీర్పుపైన సుప్రీం కోర్ట్ కు వెళ్లి స్టే తెచ్చుకున్నారు.. ప్యాంట్, టీ షర్ట్స్ వేసుకున్నంత మాత్రాన రాహుల్ గాంధీకి ఫాలోయింగ్ పెరగదు.. రాహుల్ గాంధీ పైన ట్రోల్స్ ను యువకులు ఎంజాయ్ చేస్తారు..’ అని కిషన్ రెడ్డి తెలిపారు.
