Site icon NTV Telugu

Kishan Reddy : రవీందర్ ఆత్మహత్య ఘటనకు సీఎం కేసీఆరే బాధ్యత వహించాలి

Kishan Reddy

Kishan Reddy

హోంగార్డు రవీందర్ ఆత్మహత్యయత్నం పై కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. గత 17 ఏండ్లుగా హోంగార్డ్ గా పనిచేస్తున్న రవీందర్ (35) ఆత్మహత్యాయత్నం ఘటనకు ముఖ్యమంత్రి కేసీఆరే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నాననన్నారు. అసెంబ్లీ సాక్షిగా 2017లో స్వయంగా సీఎం కేసీఆర్ హోంగార్డ్స్ ను పర్మినెంట్ చేస్తా అని మాట ఇచ్చి తప్పారు. వాళ్ల గోడు చెప్పుకుందాం అంటే ఆయన దొరకరని, గత 2 నెలలుగా మంత్రుల ఇండ్ల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడం, జీతం సరిగా రాకపోవడం పైగా అవమానాలు, చీత్కారాలతో విసిగిపోతున్న హోంగార్డులు తీవ్ర ఆవేదనలో ఉన్నారని కిషన్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.

Also Read : Sundar Pichai: గూగుల్‌కు 25 ఏళ్లు.. ఉద్యోగులను ఉద్దేశించి సీఈవో బ్లాగ్

16 వేల మంది హోంగార్డ్స్ కు కేవలం రూ.27వేల జీతం ఇస్తున్నారు. ఏదైనా కారణంతో ఒక్క రోజు విధులకు హాజరు కాకపోతే తొమ్మిదివందల రూపాయలు కట్ చేస్తున్నారు. అంటే హోంగార్డులను రోజూవారీ కూలీలుగా కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని కిషన్‌ రెడ్డి ధ్వజమెత్తారు. సంవత్సరానికి వందరోజుల అలవెన్స్ కింద 20 వేలు, యూనిఫాం అలవెన్స్ కూడా ఇస్తా అని ఇవ్వడం లేదు. 40 ఏండ్లు పని చేసిన వారికి సైతం రిటైర్మెంట్ అయితే శాలువా కప్పి బోకే ఇచ్చి పంపిస్తున్నారు. కానీ హోంగార్డులు డిమాండ్ చేస్తున్నట్లుగా రూ.10లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వడం లేదు. ఉన్నన్ని రోజులు వారి సేవలను వినియోగించుకుని ఆ తర్వాత రోడ్డున వదిలేసేలా కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు.

Also Read : Asia Cup 2023: సూపర్-4లో.. బంగ్లాదేశ్పై పాకిస్తాన్ ఘన విజయం

అంతేకాకుండా.. ‘విధి నిర్వహణలో చనిపోతే ప్రమాదబీమా, కారుణ్య నియామకాలు చేపట్టాలన్న హోంగాంర్డుల డిమాండ్‌ను కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఉద్యోగభద్రత, హెల్త్ కార్డులు ఇవ్వాలని వారు చేస్తున్న న్యాయమైన డిమాండ్ లు నెరవేర్చాలని, అసెంబ్లీ సాక్షిగా మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ను బీజేపీ పార్టీ డిమాండ్ చేస్తుంది. గతంలో తాను హోంగార్డుల సమస్యల పరిష్కారం కోసం ధర్నాలు చేయడం, వారి హక్కుల కోసం పోరాడిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఎన్ని సమస్యలున్నా ఆత్మహత్య పరిష్కారం కాదని, హోంగార్డులు అధైర్య పడొద్దని కిషన్ రెడ్డి అన్నారు. హోంగార్డ్స్ కి బీజేపీ మద్దతు ఉంటుందని భరోసా ఇస్తున్నాను.’ అని ఆయన అన్నారు.

Exit mobile version