Site icon NTV Telugu

Kishan Reddy : డబుల్ బెడ్ రూం ఇళ్ళపై ఉద్యమం చేపడతాం

Kishan Reddy

Kishan Reddy

తెలంగాణలో 30 శాతం వాటాల ప్రభుత్వం నడుస్తోందని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. శనివారం ఇందిరా పార్క్ ధర్నాలో కిషన్ రెడ్డి ముగింపు స్పీచ్‌లో మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో డబుల్ ​బెడ్​రూమ్​ ఇండ్ల కోసం పోరాటం ఉధృతం చేయాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఇక్కడున్న ప్రభుత్వం నిజాం ఆలోచనలతో నడిచే ప్రభుత్వం.. రాజాకార్ల వారసత్వంతో స్నేహం చేసే ప్రభుత్వమన్నారు. రాజాకార్ల అడుగు జాడల్లో నడిచే పార్టీలతో చేతులు కలిపి ముందుకు వెళ్లే ప్రభుత్వం. కాబట్టి అలాంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని ఆయన వ్యాఖ్యానించారు. ఫామ్ హౌస్ లో, ప్రగతి భవన్ లో నిద్ర పోతున్నది కేసీఆర్ ప్రభుత్వమని, వరదలు వచ్చినా కేసీఆర్ బయటకు రాడు అంటూ ఆయన విమర్శలు గుప్పించారు.

Also Read : Viral video:ఇదేందయ్యా ఇది…బోగీల్లో కరెంటు లేదని టీటీఈని టాయిలెట్‌లో బంధించిన ప్రయాణికులు!

డబుల్ బెడ్ రూం ఇండ్ల పై ఉద్యమం చేపడతామని ఆయన వెల్లడించారు. ఈ నెల 16,17 తేదీల్లో బస్తీల సమస్యలపై “బస్తీల బాట” బస్తీ పేద ప్రజలను కలిసి సమస్యల పై దరఖాస్తుల స్వీకరణ.. 18 వ తేదీన డబుల్ బెడ్ రూం ఇండ్ల ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మండల కేంద్రాల్లో ధర్నాలు. 23,24 తేదీల్లో అన్ని జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా. వచ్చే నెల 4 వ తేదీన డబుల్ బెడ్ రూం ఇండ్ల సమస్య పైన హైదరాబాద్ లో సీఎం కేసీఆర్ కండ్లు తెరిపించే విధంగా భారీ ధర్నా ఉంటుంది. ప్రభుత్వం కండ్లు తెరిపిస్తాం. ఇండ్లు ఇస్తారా గద్దె దిగుతారా అని బీఆర్ ఎస్ నాయకులను ప్రశ్నించాలి.. నిలదీయాలి. డబుల్ బెడ్ రూం ఇండ్ల రావాలంటే బీజేపీ అధికారంలోకి రావాలి. పేద ప్రజలంతా బీజేపీతో కలిసి రావాలి’ అని కిషన్‌ రెడ్డి అన్నారు.

Also Read : Shabbir Ali : రెండు సార్లు గెలిచా.. కానీ 2 తరాలకు అవసరమైన అభివృద్ధి చేసా

Exit mobile version