NTV Telugu Site icon

Kishan Reddy : తెలంగాణ ముందుకు వెళ్లాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి

Bapurao

Bapurao

రాథోడ్ బాపురావు బీజేపీలో చేరడం సంతోషమన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. బీజేపీలోకి రాథోడ్‌ బాపురావు చేరారు. అయితే.. ఈ సందర్భంగా ఆయన పార్టీ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు కిషన్‌ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మరికొంత మంది బీజేపీలో చేరబోతున్నారని తెలిపారు. సాయంత్రం బీజేపీ సీఈసీ సమావేశం ఉంటుందన్నారు. సాయంత్రం కొన్ని సీట్ల పై స్పష్టత వస్తుందని, మిగిలిన సీట్లను త్వరలో ప్రకటిస్తామన్నారు కిషన్‌ రెడ్డి. మూడో తేదీ నుంచి ప్రచార కార్యక్రమాలు మొదలు పెడతామని, ఎన్నికలకు సమాయత్తం అవుతామన్నారు కిషన్‌ రెడ్డి. రాష్ట్రంలో అధికార పార్టీకి వ్యతిరేకత ఉందని, కాంగ్రెస్ గ్యారెంటీల పేరుతో కర్ణాటక ప్రజలను మోసం చేసినట్లు తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు కిషన్‌ రెడ్డి. కర్ణాటకలో ఐదునెలలుగా కరెంట్ లేదు..ఐదు రాష్ట్రాల ఎన్నికల కోసం కాంగ్రెస్ టాక్స్ వసూలు చేసి పంపిస్తున్నారని, కర్ణాటకను కాంగ్రెస్ దోచుకుటుంది.. తెలంగాణ ప్రజలు ఆలోచించాలన్నారు కిషన్‌ రెడ్డి.

Also Read : Sajjala Ramakrishna Reddy: చంద్రబాబు ఈ జన్మకు మారడు.. యుద్ధం అనేది 2019లోనే అయిపోయింది..

అంతేకాకుండా.. ‘తెలంగాణ ముందుకు వెళ్లాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. బీజేపీని ప్రజలు ఆదరించాలని.. అనేక మంది పార్టీలో చేరుతున్నారు. సాయంత్రం కొందరు కాంగ్రెస్ ప్రముఖులు బీజేపీలో చేరుతారు. బిజెపి ప్రపంచంలో అతి పెద్ద పార్టీ. కొందరు పార్టీ విడటం వల్ల పార్టీకి వచ్చిన నష్టం లేదు. పార్టీ దేశం కోసం పనిచేసే పార్టీ. వ్యక్తిగత అవసరాల కోసం పార్టీ విడితే మేము చేసేది ఏమి లేదు. జనసేనతో సీట్ల సర్దుబాటు చర్చ జరుగుతుంది.. నడ్డతో చర్చించాం. మేనిఫెస్టో భాగస్వాముల మధ్య పెట్టాం. పార్టీ విధానం ప్రకారం మేనిఫెస్టో ఉంటుంది. అందరితో చర్చించిన తరువాత మేనిఫెస్టో ప్రకటన ఉంటుంది.’ అని కిషన్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.

Also Read : Pawan Kalyan: ఎక్కడ ఉన్నాడో పట్టుకొని కొన్ని ఫోటోలు దింపండయ్యా..