NTV Telugu Site icon

Kishan Reddy : బీసీ సీఎం ప్రకటనకు విశేష స్పందన వస్తుంది

Kishan Reddy

Kishan Reddy

మిగిలిన 12 స్థానాలకు ఈ రోజు రాత్రి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ అభ్యర్థుల నామినేషన్ ల కార్యక్రమం లో ప్రజలు ముఖ్యంగా యువత ఎక్కువగా పాల్గొంటున్నారన్నారు. బీసీ సీఎం ప్రకటన కు విశేష స్పందన వస్తుందని ఆయన అన్నారు. బీసీ సమాజిక వర్గాల నుండి మంచి స్పందన ఉందన్నారు. బీజేపీకి సానుకూల వాతావరణం వచ్చిందని, పావళి పండుగ వరకు బీజేపీ ప్రచారం లో ముందు ఉంటుందన్నారు. తడి బట్టతో మెడలు కోసే విధంగా కెసిఆర్ తెలంగాణ పట్ల శాపంగా మారారన్నారు.

అంతేకాకుండా.. ‘కేసీఆర్ కుటుంబం మాఫియా లుగా మారి తెలంగాణ ను బెదిరించి దోచుకుంటున్నారు. కేసీఆర్ కు ప్రజల మీద నమ్మకం లేదు.. మాఫియా మీద నమ్మకం ఉంది. కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ లతో కర్నాటక ను ముంచారు. కర్ణాటక ప్రజలని ముంచింది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు ఏ పార్టీ అధికారం లోకి వచ్చిన తెలంగాణ భవిష్యత్ అంధకారం అవుతుంది. ప్రధాని మోడీ 11 న తెలంగాణ కి వస్తున్నారు. ఎన్నికలకు చివరి దశలో 2,3 బహిరంగ సభల్లో పాల్గొంటారు. అమిత్ షా రోడ్ లో పాల్గొంటారు. మిగతా నేతలు, కేంద్ర మంత్రులు పెద్ద సభలు కాకుండా ప్రజల్లోకి వెళ్ళే విధంగా కార్యక్రమాలు. పండగ సందర్భంగా నిజమైన దీపావళి డిసెంబర్ మూడు న రావాలని… నిజమైన లక్ష్మి దేవి కమలం పైన రావాలని ఇంటింటికి వెళ్లి చెప్పాలని బీజేపీ నిర్ణయించింది.

ప్రతి బూత్ లో ప్రతి కార్యకర్త ఇంటింటికి వెళ్ళాలని పిలుపు నిస్తున్న. గ్రామాల్లో మేము ఊహించని విధంగా యూత్ బీజేపీ లో చేరుతున్నారు. సర్వే చేస్తున్న వారిని, సెల్ పోన్,కంప్యూటర్ ల మీద కూర్చొని తప్పుడు సర్వే రిపోర్ట్ లు విడుదల చేస్తున్నారు. దొంగ సర్వేలు చేస్తున్నారు… సంస్థల ఆఫీస్ ఎక్కడో, వారు ఎవరో తెలియదు… ప్రాతిపదిక ఏంటో తెలియదు .. ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకోవాలి… ప్రజలు సర్వేలను , మా మీద చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. బీసీ ముఖ్యమంత్రి నీ బీజేపీ చేసి తీరుతుంది. బీసీ సంఘాల తో చర్చలు జరుగుతున్నాయి. మోడీ కొన్ని బీసీ సంఘాలు మోడీ నీ కలిసి ధన్యవాదాలు తెలిపాయి. ఆ సంఘాలు బీజేపీ కి మద్దతు తెలుపబోతున్నాయి’ అని కిషన్‌ రెడ్డి అన్నారు.