హైదరాబాద్ దేశంలోనే అతిపెద్ద ఆగ్రి షోకు ఆతిథ్యం ఇస్తోంది. కిసాన్ ఆగ్రి షోను ప్రారంభించనున్న తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రారంభిస్తారు. మార్చి 3 నుంచి 5 వరకు కొనసాగనుంది ఎగ్జిబిషన్. 150 మందికిపైగా ఎగ్జిబిటర్లు.. 30 వేల మంది విజిటర్లు రావచ్చని అంచనా వేస్తున్నారు.దేశంలోనే అతిపెద్ద ఆగ్రి షో “కిసాన్“ హైదరాబాద్ లో జరగనుంది. ‘‘కిసాన్” ఆగ్రి షో హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో మార్చి 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు జరగనున్నది. ఈ ఎగ్జిబిషన్‌ను తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఈ ఆగ్రి షో చాలా సార్లు విజయవంతం కాగా, ఈసారి నిర్వహించడం 32వసారి. ఈ ‘‘కిసాన్’’ ఆగ్రి షో ఎగ్జిబిషన్ రోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వీక్షకులకు అందుబాటులో ఉంటుంది.గతంలో నిర్వహించిన ఆగ్రి షో ఎగ్జిబిషన్లకు అన్ని వర్గాల నుంచి చాలా మంచి స్పందన లభించింది.
Read Also:Telangana Congress : ఈటెల రాజేందర్ పై ఛార్జ్ షీట్ విడుదల చేసిన కాంగ్రెస్ నేతలు
దేశవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ రంగంలోని ఇన్వెస్టర్లు, రైతులకు ఈ షో ఎంతో ఉపయోగపడింది. ఈసారి ‘‘కిసాన్’’ ఆగ్రి షో లో 150 మందికిపైగా ఎగ్జిబిటర్లు తమ ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచనుండగా, 30 వేల మందికి పైగా విజిటర్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 12 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తుండగా.. దీనిలో 3 రోజుల వ్యవధిలో 160కి పైగా కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నాయి. వ్యవసాయ రంగంలో కొత్తగా వచ్చిన మార్పులు, అధునాతన పరికరాలు ఇక్కడ ప్రదర్శనకు ఉంటాయి.వ్యవసాయ రంగంలోని స్టార్టప్ సంస్థలకు ప్రోత్సాహం అందించే ‘‘స్పార్క్’’ ఈ ఎగ్జిబిషన్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ సంస్థ ఇక్కడ అధునాతన సాంకేతికలు, వినూత్న ఆలోచనలను ప్రదర్శించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. 20 వరకు స్టార్టప్ సంస్థలు తమ సాంకేతికతలు, కాన్సెప్టులను ఇక్కడ ప్రదర్శిస్తాయి.
కృషి విజ్ఞాన కేంద్రం, వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఐకార్ సంస్థలు కూడా తమ ప్రదర్శనశాలలను జ్ఞాన కేంద్రం పేరిట ఏర్పాటు చేయనున్నాయి. ఈ కిసాన్ ఎగ్జిబిషన్ రైతులు తమకు అవసరమైన వ్యవసాయ ఉత్పత్తులు, నీటి నిర్వహణ, పరికరాలు, వాడే పద్ధతులు, విత్తనాలు, ప్లాంటింగ్ మెటీరియల్ తదితర విషయాల గురించి తెలుసుకునేందుకు ఉపయోగపడుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. ఓపెన్ ఎరెనాలో పెద్ద యంత్రాలు, పరికరాలను ప్రదర్శనకు ఉంచుతారు. భారతీయ వ్యవసాయ, వాతావరణ పరిస్థితులకు అవసరమైన ఎన్నో నూతన సాంకేతికతలను రైతులు ఈ ఎగ్జిబిషన్లో చూడవచ్చు.
Read Also: Naveen Case: ‘విక్రమ్’ సినిమా చూసి వేళ్లు కోసేశా.. ఇంకా కసి తీరలేదు