NTV Telugu Site icon

Kirrak Boys Vs Khiladi Girls :అనసూయ షోలో ఈ విప్పుకోవడాలు ఏంట్రా?

Anasuya

Anasuya

Kirrak Boys Vs Khiladi Girls : స్టార్ మా ఛానల్‌లో ప్రసారం అయ్యే “నీతోనే డాన్స్ 2.0 “షో ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ డాన్స్ షో ఏకంగా 13 వారాలు కొనసాగింది.రేపు ఆదివారం తో ఈ డాన్స్ షో ముగుస్తుంది.అయితే నేడు జరగనున్న ఎపిసోడ్ సీజన్ విన్నర్ ఎవరో రివీల్ చేయనున్నారు.అయితే ఈ డాన్స్ షో ఫినాలేకు సంబంధించి షూటింగ్ కూడా పూర్తి అయింది.దీనితో ఈ సీజన్ విన్నర్ ఎవరో కూడా తెలిసిపోయింది.అమర్ దీప్,తేజూ లు విన్నర్స్ గా నిలిచినట్లు సమాచారం.అయితే ఈ షో ముగుస్తుండటంతో స్టార్ మా లో మరో గేమ్ షో స్టార్ట్ అయింది.స్టార్ మా ఛానల్ బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో కి పిచ్చ క్రేజ్ వుంది.ఇప్పటికే ఏడు సీజన్స్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ కు సిద్ధం గా వుంది.అయితే ఈ ఎనిమిదో సీజన్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం కానుంది.ఈ లోపు ప్రేక్షకులకు మరింత ఎంటర్టైన్మెంట్ అందించడానికి స్టార్ మా సరికొత్త గేమ్ షో తో ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

Read Also :Kalki 2898 AD : ప్రభాస్ కల్కి మూవీ టికెట్స్ ధరల పెంపుకు గ్రీన్ సిగ్నల్..

కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్ అంటూ సాగే ఈ గేమ్ షో.. జూన్ 29 నుంచి శని ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది. అయితే ఈ గేమ్ షోకి సంబంధించిన ప్రోమో తాజాగా రిలీజ్ అయింది.ఈ గేమ్ షో టైటిల్ కు తగ్గట్టుగానే ఖిలాడీ బ్యూటిస్ ని రంగంలోకి దించారు. హాట్ బ్యూటీ అనసూయ ఈ ఖిలాడీ బ్యూటీస్ కి లీడర్ గా ఉండగా కిర్రాక్ బాయ్స్‌కి శేఖర్ మాస్టర్ లీడర్‌గా ఉన్నారు. ఈ గేమ్‌లో గెలిచిన టీం కి ఏకంగా 20 లక్షల ప్రైజ్ మనీ ఇవ్వనున్నారు.ఈ షో కు హాట్ యాంకర్ శ్రీముఖి యాంకర్ గా కొనసాగుతుంది.తాజాగా రిలీజ్ అయినా ప్రోమో ఇంతో ఇంట్రెస్టింగ్ గా వుంది.ఈ అనసూయ అమ్మాయిల పక్కన ఉన్నంత వరకూ అమ్మాయిల్ని ఓడించే మగాడు పుట్టలేదు శేఖర్ మాస్టర్ అంటూ అనసూయ చెప్పే డైలాగ్ అదిరిపోతుంది.ఈ ప్రోమో అంత ఎంతో సందడిగా సాగింది.ఇంట్రెస్టింగ్ టాస్క్స్ అలాగే మధ్యలో ముద్దులు,రొమాన్స్‌ తో వేరే లెవెల్ లో సాగింది.ఈ షో లో అనసూయ అదిరిపోయే అవుట్ ఫిట్ లో కనిపించింది. ప్రోమో చివర్లో టాస్క్ లో భాగంగా అనసూయ తన టాప్ ని విప్పగా శేఖర్ మాస్టర్ తన షర్ట్ విప్పారు. ప్రస్తుతం ఈ గేమ్ షో ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Show comments