Kiran Royal: జనసేన పార్టీకి రాజీనామా చేసిన విజయవాడ వెస్ట్ జనసేన ఇంఛార్జ్ పోతిన మహేష్.. ఈ రోజు కొంతమంది తన అనుచరులతో కలిసి సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.. ఇక, వైసీపీకి రాజీనామా చేసిన వెంటనే ఆయన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సంచలన ఆరోపణలు చేసిన విషయం విదితమే.. అయితే, పోతిన మహేష్ గతంలో నా రాజకీయ జీవితం జనసేన పార్టీలోనేనని.. తాను వేరే పార్టీ జెండా పట్టుకుంటే.. ఎవరైనా వచ్చిన కొబ్బరి బోండాలు నరికే కత్తితో నా చేయి నరికేయవచ్చు అని పేర్కొన్నారు.. ఇప్పుడు జనసేన శ్రేణులు ఆ వీడియోను వైరల్ చేస్తున్నాయి.. ఇక, పోతిన మహేష్‌కు కౌంటర్ ఇచ్చారు తిరుపతి జనసేన ఇంఛార్జ్ కిరణ్ రాయల్..
Read Also: Ragging: పిల్లలపై ర్యాగింగ్ భూతం.. ఆరో తరగతి విద్యార్థులను చితకబాదిన సీనియర్లు
పోతిన మహేష్ ఇప్పుడు ఏ చేయి నరుకుంటావు? అని ప్రశ్నించారు కిరణ్ రాయల్.. కొబ్బారికాయల కత్తి నీకు మా కార్యకర్తలు కొరియర్ చేస్తారని పేర్కొన్నారు. జనసేన వల్ల నువ్వు నాయకుడు అయ్యావు ఆ విషయాన్ని గుర్తుంచుకొని మాట్లాడాలని సూచించారు. ఎంత తీసుకుని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై బురద చల్లావో అందరికి తెలుసు అని దుయ్యబట్టారు. 2019లో నీకు సీటు ఇచ్చింది పవన్ కల్యాణే.. ఆ విషయాన్ని మర్చిపోవద్దు అని సలహా ఇచ్చారు. ఇప్పుడు నువ్వు కోవర్టు అని తెలియడంతోనే దూరం పెట్టారని వ్యాఖ్యానించారు కిరణ్ రాయల్. పోతిన ఎపిసోడ్‌పై ఓ వీడియో విడుదల చేసిన కిరణ్.. ఈ మధ్య పోతిన మహేష్ మాట్లాడిన ఆ వీయోను ప్లే చేశారు. మొత్తానికి సీటు కోసం 10 రోజుల ధర్నా, దీక్ష, ఇప్పుడు ప్యాకేజీ, వైసీపీ కండువా అంటూ కౌంటర్ ఇచ్చారు. వారం క్రితమే వేరే జెండా పట్టుకుంటే చేయి నరుక్కుంటా అన్నావు.. ఇప్పుడు ఏ చేయి నరుక్కుంటావు? అని ప్రశ్నించారు. గతంలో.. జనసేన పార్టీ కార్యాలయం ముందు పవన్ కల్యాణ్ కోసం పడిగాపులు కాసిన విషయాన్ని మరిచారా? నిన్ను నాయకుడిని చేసిందే జనసేనాని అని విషయాన్ని మర్చిపోవద్దు అని సూచించారు. ఇక, ఆరణి శ్రీనివాస్.. నా గురించి ఏదో మాట్లాడుతున్నావు.. అది మా పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చూసుకుంటారు.. నాకు పార్టీపై గానీ, పవన్ కల్యాణ్ పై గానే ఎలాంటి అసంతృప్తి లేదని స్పష్టం చేశారు కిరణ్ రాయల్.