Site icon NTV Telugu

Laxmi Reddy: కిరణ్ రాయల్ అంశంలో బిగ్ ట్విస్ట్.. జనసేన, వైసీపీ నేతలపై లక్ష్మీరెడ్డి ఫిర్యాదు

Thirupathi

Thirupathi

Laxmi Reddy Files Police Complaint: కిరణ్ రాయల్ అంశంలో బిగ్ ట్విస్ట్ నెలకొంది.. ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో పలువురు జనసేన, వైసీపీ నేతలపై లక్ష్మీరెడ్డి ఫిర్యాదు చేసింది. ఆలస్యంగా సంచలన నిజాలను బయటపెట్టింది. జనసేన నేత దినేష్ జైన్, హరి శంకర్, గనితో పాటు వైసీపీ నేత సురేష్‌పై ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వైసీపీ నేత సురేష్ ఫొటో, వీడియోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. సురేష్‌కు జనసేన నేతలు దినేష్ జైన్, గని, హరి శంకర్ సహకారం అందించారు. సోషల్ మీడియాలో ఉన్న మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలను డిలీట్ చేయాలని అనేకమార్లు కోరాను. టైం వచ్చినప్పుడు డిలీట్ చేస్తామని.. ఇప్పుడు సైలెంట్‌గా ఉండాలని జనసేన, వైసీపీ నేతలు ఒత్తిడి పెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొంది. సోషల్ మీడియాల్లో తనపై జరుగుతున్న విష ప్రచారానికి చెక్ పెట్టేందుకు ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మార్ఫింగ్ వీడియో, ఫొటోలను వైరల్ చేసిన వ్యక్తులపై కఠినంగా శిక్షలని పోలీసులను కోరింది.

READ MORE: Fastag New Rules: అలర్ట్.. ఫాస్టాగ్‌ చెల్లింపుల్లో కొత్త నియమాలు..

ఇదిలా ఉండగా.. జనసేన నేత కిరణ్‌ రాయల్‌ మాయమాటలతో తాను సర్వస్వం కోల్పోయానని, ఆయన అవసరాలకు తన నుంచి తీసుకున్న రూ.1.20 కోట్లు, 25 సవర్ల బంగారాన్ని మాత్రమే తాను తిరిగి అడుగుతున్నానని తిరుపతికి చెందిన లక్ష్మీరెడ్డి గతంలో తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఆమె మాట్లాడారు. తనలాగే కిరణ్‌ రాయల్‌ చేతిలో మోసపోయిన బాధితులు చాలామంది ఉన్నారని ఆమె ఆరోపించారు. తనకు ఏ పార్టీ మద్దతు లేదని, కిలాడీ లేడీ అంటూ తనపై అసత్య ప్రచారం చేయడం తగదన్నారు. తనకు ఎమ్మెల్యే సీటు ఇస్తారని, పార్టీ అధికారంలోకి వస్తే రెట్టింపు డబ్బులు ఇస్తానని, పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడన్నారు. పిల్లల భవిష్యత్తు, తానిచ్చిన డబ్బులు తిరిగి రాబట్టుకోవడం కోసమే ఈ పోరాటం చేస్తున్నానని.. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌లు అండగా నిలిచి న్యాయం చేయాలన్నారు. అంతకుముందు ఎస్పీ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కిరణ్‌ రాయల్‌పై ఆమె ఫిర్యాదు చేశారు.

READ MORE: Aadi Srinivas : హరీష్ రావు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు..

Exit mobile version