Site icon NTV Telugu

Kiran Kumar Reddy: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సెటైర్లు..!

Kiran Kumar Reddy

Kiran Kumar Reddy

Kiran Kumar Reddy Mocks Rahul Gandhi : రాయచోటిలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై బీజేపీ నేత, మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సెటైర్లు వేశారు.. రోజు రోజుకి రాహుల్ గాంధీ తెలివి ఏమైందో అర్థం కాలేదన్నారు.. ఆటంబాంబు పేలు స్థానం అన్నారు… అది తుస్సు మని పోయిందని విమర్శించారు.. కేంద్రంలో బీజేపీ రిగ్గింగ్ చేసుకొని ఎలక్షన్ కమిషన్ తో మూలాఖాత్ అయి ప్రభుత్వం మూడోసారి వచ్చిందని చెప్తారని.. కొంచమైనా తెలివి ఉపయోగించాలి కదా? అని విమర్శించారు.. 2014లో వాళ్ల కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే దగ్గర దగ్గర 282 భారతీయ జనతా పార్టీ గెలుచుకొని 35 సంవత్సరాల తర్వాత మొట్ట మొదటిసారిగా ఒక పార్టీ పూర్తి మెజార్టీ వచ్చింది. 2019లో 303 సీట్లు గెలుచుకొని దానికంటే ఎక్కువ మెజార్టీ వచ్చింది.. ఈ ఎలక్షన్ లో రిగ్గింగ్ జరిగితే 400 సీట్లు రావాలి కానీ 240 సీట్లు ఎలా వస్తాయి? అని ప్రశ్నించారు. భారతీయ జనతా పార్టీ ఎన్నికల కమిషన్ తో కలిపి రిగ్గింగ్ చేస్తే 400 సీట్లు రావాలి కానీ 240 సీట్లు ఎలా వస్తాయి? అని నిలదీశారు. బాగా ఆలోచించుకోవాలన్నారు.

READ MORE: Phantom Blaq: మారుతి గ్రాండ్ విటారా ఫాంటమ్ బ్లాక్ ఎడిషన్ రిలీజ్.. కళ్లు చెదిరే ఫీచర్లు

“ఆయన మాట్లాడే మాటలే నాకే అర్థం కాలేదు నేను అన్ని సంవత్సరాలు పార్టీలో ఉంటే.. మహారాష్ట్ర ఎన్నికల్లో 5 నెలలు ముందర సగం పార్లమెంటు సీట్లు వచ్చాయి.. 5 నెలల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరిగితే నాకు పూర్తిగా డిపాజిట్లు గల్లంతయాయని అన్నారు.. కొంచెం తెలివి ఉంటే ఉపయోగించాలి.. లేదంటే తెలివి ఉన్నవారిని పక్కన పెట్టుకోవాలి.. 2009లో ఏపీలో ఒకేసారి ఎన్నికలు జరిగితే అసెంబ్లీ ఎన్నికల్లో 156 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది.. 33 పార్లమెంట్ స్థానాలు వచ్చాయి.. పార్లమెంటులో 194 సీట్లు మెజార్టీ వచ్చింది.. ఒకేసారి ఒకేరోజు ఎన్నికలు జరిగితే 38 అసెంబ్లీ సెగ్మెంట్ లలో పార్లమెంటుకు మెజార్టీ వచ్చింది.. అసెంబ్లీకి తక్కువ మెజార్టీ వచ్చింది.. దీన్ని ఏమంటారు రిగ్గింగ్ అంటారా? ప్రజలు చాలా తెలివైన వారు.” అని మాజీ సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

Exit mobile version