బ్రిటన్ కొత్త చక్రవర్తి చార్లెస్ III పట్టాభిషేకం మే 6న జరిగింది. ఈ ప్రత్యేక కార్యక్రమం లండన్‌లోని చారిత్రాత్మక రాజ కేథడ్రల్ వెస్ట్‌మిన్‌స్టర్ అబ్బేలో జరగగా ఈ వేడుకకు వివిధ దేశాల అధినేతలు, మత పెద్దలు, ప్రముఖులు హాజరయ్యారు. గత కొన్ని నెలలుగా ఈ పట్టాభిషేకానికి సన్నాహాలు సాగుతున్నాయి. దీనికి సంబంధించిన వార్తలు కూడా కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో, వెబ్ సైట్లలో బాగా వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ పట్టాభిషేక కార్యక్రమానికి సంబంధించి మరో వార్త తెగ హల్ చల్ చేస్తోంది. బ్రిటిష్ రాజకుటుంబంతో, చార్లెస్ చక్రవర్తితో ఓ కప్ప ప్రత్యేక సంబంధం కలిగి ఉందన్న వార్త రీసెంట్ గా వెలుగులోకి వచ్చింది.