King 100 Glimpse: ‘మహంతి ఝాన్సీ రాణి’ అనే నేను..
- అక్కినేని నాగార్జున నటిస్తున్న 100వ చిత్రం
- ‘కింగ్ 100’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు
- టబు పుట్టినరోజు సందర్భంగా..
- ఆమె పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్, ప్రత్యేక గ్లింప్స్ విడుదల..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
King 100 Glimpse: టాలీవుడ్ సీనియర్ నటుల్లో ఒకరైన అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘కింగ్ 100’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. నాగార్జున నటిస్తున్న 100వ సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ బజ్ ఏర్పడింది. తాజాగా ఈ సినిమా నుంచి బాలీవుడ్ సీనియర్ నటి టబుకు సంబంధించిన ప్రత్యేక గ్లింప్స్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. టబు పుట్టినరోజు సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు పవర్ఫుల్ గ్లింప్స్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ గ్లింప్స్‌లో టబు ‘మహంతి ఝాన్సీ రాణి’ అనే పాత్రలో కనిపించింది. ఆమె లుక్, బాడీ లాంగ్వేజ్‌తో పాటు చెప్పిన డైలాగ్ ప్రత్యేకంగా ఉన్నాయి. “మనుషుల్లో రెండు రకాలు.. కష్టాన్ని నమ్మేవాళ్లు, అదృష్టాన్ని నమ్మేవాళ్లు. మహంతి ఝాన్సీ రాణి అనే నేను..” అంటూ టబు చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది. అలాగే ‘హార్డ్ వర్క్, లక్.. ఐ హేట్ లక్’ అనే సంభాషణ కూడా ఆసక్తిని పెంచుతోంది. ఈ పాత్రలో ప్రతినాయక ఛాయలు ఉండబోతున్నాయని గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది.
Also Read
- Murasu Cyclone: మురసు తుఫాన్ బీభత్సం.. ఏపీలో పలు జిల్లాలు జలమయం!
- IND vs NZ: అర్ష్‌దీప్ దెబ్బకు కివీస్ విలవిల.. ఫీల్డింగ్‌లో మెరిసిన రోహిత్, కోహ్లీ..! టీమిండియా టార్గెట్ ఎంతంటే.?
- US Midterm Elections: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో పియా దండియా రాక్.. వివేక్ రామస్వామికి షాక్..
- US Midterm Elections: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ షాక్.. రిపబ్లికన్ పార్టీ ఘోర పరాజయం..
ఈ సినిమాలో మరో ఆసక్తికరమైన అంశం నాగార్జున, టబు కాంబినేషన్. దాదాపు 28 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరు నటీనటులు మళ్లీ ఒకే సినిమాలో కనిపించబోతున్నారు. గతంలో వీరిద్దరూ కలిసి నటించిన ‘నిన్నే పెళ్లాడతా’, ‘ఆవిడా మా ఆవిడే’ చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. ముఖ్యంగా వీరి మధ్య కనిపించిన రొమాంటిక్ కెమిస్ట్రీకి అప్పట్లో ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. అయితే ‘కింగ్ 100’లో మాత్రం గత చిత్రాలకు పూర్తి భిన్నంగా వీరిద్దరి మధ్య ఘర్షణ ఉండబోతున్నట్లు మేకర్స్ సంకేతాలిచ్చారు. ‘దిస్ టైమ్.. ఇట్స్ నాట్ లవ్’ అంటూ విడుదల చేసిన ప్రచార కంటెంట్‌తో ఈసారి ప్రేమకథ కాకుండా యాక్షన్, శత్రుత్వంతో కూడిన కథ ఉండబోతోందని స్పష్టమవుతోంది. టబు సైతం ‘ఈసారి కింగ్‌తో యుద్ధమే’ అంటూ సోషల్ మీడియాలో ఆసక్తికరమైన పోస్ట్ పెట్టడం విశేషం.
ఇక ఈ చిత్రానికి రా. కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్, T-సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అలాగే రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని 2026 డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
తాజావార్తలు
-
King 100 Glimpse: ‘మహంతి ఝాన్సీ రాణి’ అనే నేను..
-
Murasu Cyclone: మురసు తుఫాన్ బీభత్సం.. ఏపీలో పలు జిల్లాలు జలమయం!
-
IND vs NZ: అర్ష్‌దీప్ దెబ్బకు కివీస్ విలవిల.. ఫీల్డింగ్‌లో మెరిసిన రోహిత్, కోహ్లీ..! టీమిండియా టార్గెట్ ఎంతంటే.?
-
Spain Train Disaster: స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం.. 69 మంది మృతి.. రవాణా మంత్రి రాజీనామా!
-
Sachin Tendulkar: నచ్చిన ఆటగాళ్లను ఎంచుకోలేకపోయా.. టీమిండియాపై సచిన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
IPL 2027-CSK: ఐపీఎల్లో సీఎస్కే భారీ ప్లాన్.. రూ.13 కోట్ల సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్‌పై కన్ను!
-
Rohit Sharma: వయసు జస్ట్ నంబర్ మాత్రమే.. రోహిత్ శర్మ డైవ్ చూస్తే ‘వావ్’ అనాల్సిందే.!
-
National Stress Awareness Day : డిజిటల్ డిటాక్స్.. మానసిక ప్రశాంతతకు నేటి కాలపు మంత్రం
-
Shadashtak Yoga : సూర్య-శని షడాష్టక యోగం కలకలం.. ఈ 6 రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి
-
Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి