Site icon NTV Telugu

E-Luna Prime: మార్కెట్ లోకి కైనెటిక్ గ్రీన్ ఈ-లూనా ప్రైమ్.. సింగిల్ ఛార్జ్ తో 140KM రేంజ్..

E Luna Prime

E Luna Prime

ఎలక్ట్రిక్ వాహనాల హవా కొనసాగుతోంది. దిగ్గజ టూవీలర్ తయారీ కంపెనీలు ఈవీలను రూపొందించి మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్నాయి. ఎలక్ట్రిక్ బైకులు, స్కూటర్లు రోడ్లపై రయ్ రయ్ మంటూ దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ వాహన తయారీదారు కైనెటిక్ ఇ-లూనా ప్రైమ్‌ను ప్రారంభించింది. కైనెటిక్ గ్రీన్ మార్కెట్లో ఇ-లూనా ప్రైమ్‌ను విడుదల చేసింది. తయారీదారు ఈ మోపెడ్‌ను విస్తృత శ్రేణి ఫీచర్లతో అందిస్తోంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మారుతున్న అవసరాలను తీర్చడానికి రూపొందించబడిన ఇ-లూనా ప్రైమ్ వినియోగదారులకు బెస్ట్ ఆప్షన్ అని కంపెనీ తెలిపింది.

Also Read:Little Hearts : లిటిల్ హార్ట్స్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడు, ఎక్కడ..?

కొత్త ఇ-లూనా ప్రైమ్ కోసం రెండు సీటింగ్ ఆప్షన్ ను అందించారు. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 110-140 కిలోమీటర్ల పరిధిని ఇస్తుందని కంపెనీ తెలిపింది. కైనెటిక్ గ్రీన్ నుండి వచ్చిన ఈ మోపెడ్ LED హెడ్‌లైట్, సింగిల్ సీటు, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, రిమ్ టేప్, బాడీ డెకాల్స్, ట్యూబ్‌లెస్ టైర్లు వంటి ఫీచర్లను కలిగి ఉంది. కొత్త ఇ-లూనా ప్రైమ్‌ను భారత మార్కెట్లో రూ. 82,490 ఎక్స్-షోరూమ్ ధరకు విడుదల చేశారు.

Exit mobile version