NTV Telugu Site icon

Giriraj Singh: బెంగాల్‌లో కిమ్ జోంగ్ ఉన్ ప్రభుత్వం.. ఈడీపై దాడిని ఖండించిన కేంద్రమంత్రి

Giriraj Singh

Giriraj Singh

పశ్చిమ బెంగాల్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బృందంపై దాడి ఘటనపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై విమర్శలు గుప్పించారు. బెంగాల్‌లో ప్రజాస్వామ్యం లేదు.. ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ లాంటి ప్రభుత్వాన్ని మమతా బెనర్జీ నడిపిస్తున్నట్లు కనిపిస్తోంది.. ‘పశ్చిమ బెంగాల్‌లో ప్రజాస్వామ్యం అంటూ ఏమీ లేదు.. అక్కడ కిమ్‌ జాంగ్‌ ఉన్‌ ప్రభుత్వం ఉన్నట్లుంది.. హత్య జరిగినా అది కొత్త విషయం కాదని అధిర్ రంజన్ అంటున్నారు.. ఇది మమతా బెనర్జీ ప్రజాస్వామ్యం అంటూ కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ మండిపడ్డారు.

Read Also: Channel Rates : మీరు సీరియల్ ప్రియులా.. అయితే ఇక భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే..

అయితే, రేషన్ కుంభకోణానికి సంబంధించి టీఎంసీ బ్లాక్ లెవల్ అధికారులు షాజహాన్ షేక్ తో పాటు శంకర్ ఆద్యా, వారి బంధువులను అరెస్టు చేయడానికి బయలుదేరిన దర్యాప్తు సంస్థ బృందం ఉత్తర 24 పరగణాస్ జిల్లాలోని సందేశ్‌ఖాలీ గ్రామంలో దాడి చేసి వారి వాహనాలను ధ్వంసం చేశారు. రేషన్ పంపిణీలో కోట్లాది రూపాయల కుంభకోణంలో షాజహాన్ షేక్ ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ కూడా అధికారులపై దాడిని ఖండించారు. ఇది ప్రజాసామ్యానికి ప్రమాదకరమైన చర్య.. ఇలాంటి భయంకరమైన సంఘటనలను ఊపేక్షించేది లేదని పేర్కొన్నారు.