Kim Jong Un : కన్నీళ్లు పెట్టుకున్న ఉత్తర కొరియా కింగ్ కిమ్ జాంగ్ ఉన్.. ఏం కష్టమొచ్చిందో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kim Jong Un : ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జోంగ్ ఉన్ తన దేశ మహిళలకు వీలైనంత ఎక్కువ మంది పిల్లలను కనాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ఆయన విజ్ఞప్తి చేయగా కళ్లలో నీళ్లు తిరిగాయి. దీంతో అక్కడ ఉన్న మహిళలంతా ఏడవడం మొదలుపెట్టారు. కొరియా నియంత ఉద్వేగానికి లోనైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన భావోద్వేగ విజ్ఞప్తిలో కిమ్ జోంగ్ ఉన్ తన దేశంలోని మహిళలను ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉండాలని.. వారిని కమ్యూనిస్టుల వలె పెంచాలని కోరారు. ఈ ప్రసంగంలో ఆయన కళ్లలో నీళ్లు తిరిగాయి. ఉత్తర కొరియాలోని ప్యోంగ్‌యాంగ్‌లో జరిగిన ఐదవ జాతీయ మదర్స్ కాన్ఫరెన్స్‌లో ప్రసంగించిన కిమ్, ఉత్తర కొరియా తగ్గుతున్న జననాల రేటును పెంచడం ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.
Read Also:Animal Movie: క్రిటిక్ కి సాలిడ్ రిప్లై… నిజం చెప్పు వంగా బ్రో ఆ ట్వీట్ చేసింది నువ్వే కదా?
Also Read
- Kakarakaya Vepudu: అన్నంలోకి 'కాకరకాయ వేపుడు'.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
- HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
- Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
- Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
వీడియోలో, కిమ్ చేతి రుమాలుతో కన్నీళ్లు తుడుచుకోవడం కనిపించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జననాల రేటు తగ్గుదలను అరికట్టడం, పిల్లలకు మంచి సంరక్షణ, విద్య అందించడం అన్నీ మన కుటుంబ సమస్యలని, వీటిని తల్లులతో కలిసి పరిష్కరించుకోవాలని అన్నారు. కిమ్ జోంగ్ ఉన్ ప్రసంగంలో సంతానోత్పత్తి రేటు, పిల్లల పెంపకం, దేశ బలాన్ని పెంచడంలో మహిళల పాత్ర గురించి వివరించారు.
Read Also:Narayana Swamy: వార్డు మెంబర్‌గా కూడా గెలవని లోకేష్.. రెడ్ బుక్ రాస్తున్నాడంట!
ఉత్తర కొరియాలో సంతానోత్పత్తి రేటు 1.8
దేశ భవిష్యత్తును రూపొందించడంలో తల్లుల ముఖ్యమైన బాధ్యతను కూడా కిమ్ జోంగ్ ఉన్ ఎత్తిచూపారు. తల్లులందరూ సమాజం పట్ల, వారి కుటుంబాల పట్ల తమ బాధ్యతలు, విధులను నిర్వర్తించాలని ఆమె అన్నారు. ఉత్తర కొరియాలో సంతానోత్పత్తి రేటు 1.8గా నమోదైంది. సంతానోత్పత్తి రేటు తక్కువగా ఉన్న మొదటి దేశం ఉత్తర కొరియా కాదు. ఉత్తర కొరియా పొరుగున ఉన్న దక్షిణ కొరియా తక్కువ జననాల రేటును నమోదు చేసింది. ఇక్కడ సంతానోత్పత్తి రేటు 0.78. జపాన్‌లో ఇది 1.26గా ఉంది.
Kim Jong Un CRIES while telling North Korean women to have more babies.
The dictator shed tears while speaking at the National Mothers Meeting as he urged women to boost the countries birth rate. pic.twitter.com/J354CyVnln
— Oli London (@OliLondonTV) December 5, 2023
తాజావార్తలు
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
EPIC : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న ‘ఎపిక్’.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే?
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
-
Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!