Animal Movie: క్రిటిక్ కి సాలిడ్ రిప్లై… నిజం చెప్పు వంగా బ్రో ఆ ట్వీట్ చేసింది నువ్వే కదా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సందీప్ రెడ్డి వంగ, రణబీర్ కపూర్ కాంబినేషన్ లో వచ్చిన అనిమల్ సినిమా వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తుంది. వర్కింగ్ డే, వీక్ డే అనే తేడా లేకుండా సాలిడ్ గ్రిప్ ని మైంటైన్ చేస్తే కలెక్షన్స్ ని రాబడుతుంది. అనిమల్ మూవీ ఇప్పటివరకు వరల్డ్ వైడ్ గా 480 కోట్లు రాబట్టి ఈరోజుతో 500 కోట్ల మార్క్ ని దాటనుంది. వన్ వీక్ కంప్లీట్ అయ్యే లోపే 500 కోట్ల మార్క్ ని టచ్ చేసిన అనిమల్ సినిమాపై ఎన్ని పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయో, అన్ని నెగటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి. సందీప్ రెడ్డి వంగ సినిమాకి ఎప్పుడూ ఉన్నట్లే అనిమల్ సినిమాపై విమర్శలు వస్తున్నాయి. కబీర్ సింగ్ సినిమాని వైల్డ్ మూవీ అంటేనే సందీప్ రెడ్డి వంగ, అసలైన వయొలెంట్ సినిమా ఎలా ఉంటుందో చూపిస్తా అంటూ అనిమల్ చేసాడు. ఇప్పుడు అనిమల్ ని అంటే సైలెంట్ గా ఉంటాడా? రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేస్తాడు. ఇలాంటిదే ఇప్పుడో సంఘటన జరిగింది.
అనిమల్ సినిమాని చూసిన లిరిసిస్ట్ స్వనంద్ కిర్కీరే తన రివ్యూ చెప్తూ… “అనిమల్ సినిమా చూసిన తర్వాత ఈ జనరేషన్ అమ్మాయిలపై జాలి కలుగుతుంది. అమ్మాయిలని రెస్పెక్ట్ ఇవ్వని ఒక అబ్బాయి ప్రపంచంలోకి వచ్చాడు. తనని తానూ గొప్ప అనుకుంటాడు, గర్వంగా ఫీల్ అవుతాడు. రణబీర్ కపూర్ ఒక సీన్ లో ఆల్ఫా మేల్ అవ్వలేని వాళ్లు కవులుగా మారిపోయి ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తారు అనే డైలాగ్ చెప్పాడు. నేను కవిని మరి నాకు ఇక్కడ చోటు ఉందా? ఇండియన్ సినిమా ఎటు వైపు వెళ్తుంది” అంటూ స్వనంద్ చెప్పాడు. ఈ మాటలకి రెస్పాండ్ అయిన అనిమల్ మూవీ అఫీషియల్ ట్విట్టర్ అక్కౌంట్… “Do not let your knees fall ahead of your toes or cave in towards each other. Keep feet shoulder-width apart to maintain a good base of support for balance. Land softly on the balls of the feet to help absorb the force of the landing. Yes…. now it landed perfectly” అంటూ రిప్లై ఇచ్చింది. ఈ ట్వీట్ చూడగానే అనిమల్ ట్విట్టర్ అకౌంట్ నుంచి సందీవ్ రెడ్డి వంగనే ఈ రిప్లై ఇచ్చాడు అంటూ సోషల్ మీడియాలో వంగ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. మరికొంతమందేమో అతన్ని ఇంకా గెలక్కండి అనిమల్ పార్క్ సినిమాని మరింత వయొలెంట్ గా తీస్తాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read
- రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
- Kayadu Lohar: కయాదు వెనుక ఇంత కన్నీటి కథ ఉందా? 'ప్యారడైజ్' బ్యూటీ జర్నీ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
- Ravi Teja: హిట్టు పడగానే రేటు పెంచేసిన మాస్ రాజా.. నిర్మాత డ్రాప్.. సంక్రాంతి సినిమా క్యాన్సల్ ?
Do not let your knees fall ahead of your toes or cave in towards each other. Keep feet shoulder-width apart to maintain a good base of support for balance. Land softly on the balls of the feet to help absorb the force of the landing.
Yes…. now it landed perfectly 😘… pic.twitter.com/OxTOE0vlvI— Animal The Film (@AnimalTheFilm) December 6, 2023
తాజావార్తలు
-
Water Crisis: హైదరాబాద్ కు తాగునీటి ముప్పు..!
-
SIR Notice: ఎల్కే అద్వానీకి SIR నోటీసులు..
-
రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
-
Yogi Adityanath: హమీద్ అన్సారీ ‘హిందూ’ వ్యాఖ్యలపై యోగి ఘాటు కౌంటర్
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!