హైదరాబాద్‌లోని సరూర్ నగర్ లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కిడ్నీ మార్పిడిలు జరుగుతున్నాయి. ఎలాంటి అనుమతి లేకుండా నలుగురికి కిడ్నీ మార్పిడి చేశారు డాక్టర్లు.. ఈ సమాచారంతో ఎల్‌బీ నగర్ ఏసీపీ కృష్ణయ్య, రంగారెడ్డి జిల్లా డీఎం అండ్ హెచ్‌వో, డిప్యూటీ డీఎంహెచ్‌వో, సరూర్ నగర్ పీహెచ్‌సీ వైద్యురాలు, జీహెచ్ఎంసీ అధికారులు, సరూర్ నగర్ పోలీసులు హాస్పిటల్‌కు చేరుకుని తనిఖీలు చేపట్టారు. అమాయకుల్ని ఆసరాగా చేసుకొని ఆ ప్రైవేట్ ఆస్పత్రి కిడ్నీ రాకెట్ దందా కొనసాగిస్తుంది.
Read Also: CM Chandrababu: దావోస్ వేదికగా మోడీపై చంద్రబాబు ప్రశంసలు.. సరైన వ్యక్తి పీఎంగా ఉన్నారు..
ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులకు డబ్బులు ఆశ చూపి.. పక్క రాష్ట్రానికి సంబంధించిన డాక్టర్లు తీసుకొచ్చి ఈ హాస్పిటల్ వాళ్ళతో కుమ్మక్కై కిడ్నీలను విక్రయించి డబ్బులు దండుకుంటున్నారు. ఈ విషయం బయటికి వెలుగు చూడడంతో మెడికల్ ఆఫీసర్ హాస్పిటల్ వద్దకు చేరుకుని పోలీసుల సహకారంతో విచారణ చేపట్టారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నలుగురు పేషెంట్స్‌ను గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. వీళ్లంతా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులుగా ప్రాథమిక సమాచారం తెలుస్తోంది. అమాయకులను టోకరా వేసి కిడ్నీ మారుస్తున్నారు డాక్టర్లు.
Read Also: Thaman: నాకు క్రికెట్లో, షోస్ లో వచ్చే డబ్బు అంతా చారిటీకే, సినిమాలో వచ్చే డబ్బు మాత్రమే నాకు!