Site icon NTV Telugu

Software Engineer Safe: హైదరాబాద్ లో కిడ్నాపైన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సేఫ్..

Safe

Safe

హైదరాబాద్ రాయదుర్గంలో కిడ్నాపైన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సురేందర్ క్షేమంగా ఉన్నాడు. కర్నూలు జిల్లా ఆత్మకూరు దగ్గర అతడిని పోలీసులు కాపాడారు. కిడ్నాప్ చేసి బంధించి కారులో తరలిస్తుండగా ఆత్మకూరు (మం) భైర్లుటీ ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అంతకుముందు.. కిడ్నాపర్లు వ్యక్తి బంధువుల నుంచి రూ.2 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాగా.. ఎట్టకేలకు కిడ్నాపర్ల చెర నుంచి సురేంద్రను రక్షించారు పోలీసులు. రాయదుర్గం నుంచి కిడ్నాపర్లు కారులో నల్లమల అడవులకు తీసుకెళ్తుండగా.. పక్కా సమాచారంతో పోలీసులు పట్టుకున్నారు. తన భర్తను వదిలిపెట్టాలంటే రూ. 2 కోట్లు ఇవ్వాలని సురేందర్ భార్యకు ఫోన్ చేసి బెదిరించారు. పోలీసులకు సమాచారం తెలియడంతో బాధితుడిని వదలి కిడ్నాపర్లు పరారయ్యారు. వారి కోసం నల్లమలలో పోలీసులు గాలిస్తున్నారు.

Exit mobile version