NTV Telugu Site icon

Game Changer Poster: ‘గేమ్​ ఛేంజర్’ నయా పోస్టర్.. కియారా లుక్ కిరాక్ అంతే!

Kiara Advani Poster

Kiara Advani Poster

మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ హీరోగా, డైరెక్టర్‌ ఎస్ శంకర్‌ తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా మూవీ ‘గేమ్‌ ఛేంజర్‌’. బాలీవుడ్ భామ కియారా అడ్వాణీ హీరోయిన్‌. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంపై ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. 10 జనవరి 2025న గేమ్‌ ఛేంజర్‌ సినిమా వరల్డ్​వైడ్​ గ్రాండ్​గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ వరుస అప్‌డేట్స్ ఇస్తున్నారు.

దీపావళి పండగ సందర్భంగా గేమ్‌ ఛేంజర్‌ టీజర్​ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్​.. తాజాగా అభిమానుల​ కోసం మరో పోస్టర్‌ను విడుదల చేశారు. హీరోయిన్ కియారా అడ్వాణీ కొత్త లుక్ పోస్టర్‌ను వదిలారు. ‘గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మాయాజాలానికి, బ్యూటిఫుల్ కియారా అడ్వాణీ అందాల అనుభుతి పొందేందుకు ఒక్క రోజే ఉంది. గేమ్ ఛేంజర్‌ టీజర్ నవంబర్ 9న వస్తోంది. జనవరి 10 నుంచి ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది’ అని ట్వీట్ చేశారు. పోస్టర్‌లో కియారా లుక్ కిరాక్‌గా ఉంది. మోడ్రన్ ఔట్ ​ఫిట్​లో కియారా అదరగొట్టారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Also Read: Nitin Chauhan Death: 35 ఏళ్ల వయసులోనే ఆత్మహత్య చేసుకున్న నటుడు!

నవంబర్ 9న గేమ్‌ ఛేంజర్‌ టీజర్ లాంచ్ ఈవెంట్ లక్నోలో జరగనుంది. టీజ‌ర్‌కు మ‌రో రోజు మాత్ర‌మే మిగిలి ఉంద‌ని తెలియ‌జేస్తూ.. చిత్ర యూనిట్ కొత్త పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. టీజర్ లాంచ్ ఈవెంట్‌కు చరణ్, కియారా, శంకర్‌ సహా టీమ్ మొత్తం హాజరవనుంది. లాంచ్ ఈవెంట్‌ లక్నోలో భారీ ఎత్తున ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. గేమ్‌ ఛేంజర్‌ నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు సినిమాపై అంచనాలు పెంచాయి. ఇక టీజర్ కోసం ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Show comments