2026 మోడల్ కియా సెల్టోస్ (న్యూ జనరేషన్) భారత్ NCAP (BNCAP) క్రాష్ టెస్ట్‌లో పూర్తి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందింది. ఇది అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ (AOP) మరియు చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ (COP) రెండింటికీ వర్తిస్తుంది. పెద్దల భద్రతలో 32కి 31.70 స్కోర్ చేయగా, పిల్లల భద్రతలో 49కి 45 స్కోర్ సాధించింది. ఈ రేటింగ్ సెల్టోస్ అన్ని వేరియంట్లకు వర్తిస్తుంది. BNCAP ప్రత్యేకంగా డీజిల్-ఆటోమేటిక్ మోడల్స్ HTE (O), GTX లను పరీక్షించింది. టాటా సియెర్రా కంటే సెల్టోస్ కొద్దిగా మెరుగైన స్కోర్ సాధించడం గమనార్హం.
Also Read:Hema: హేమకు క్లీన్ చీట్.. చనిపోవాలి అనుకున్నానంటూ షాకింగ్ కామెంట్స్!
కియా సెల్టోస్ డ్రైవర్ తల, కుడి కాలి కింది భాగానికి మంచి రక్షణను అందించింది. అయితే, రెండు కాళ్లకు, ఎడమ కాలి కింది భాగానికి తగినంత రక్షణ లభించింది. మరోవైపు, పక్కన కూర్చున్న ప్రయాణీకుడికి అన్ని కీలక శరీర భాగాలకు మంచి రక్షణ లభించింది. సైడ్ ఇంపాక్ట్ పరీక్షలో, డ్రైవర్ పక్కన కూర్చున్న ప్రయాణీకుడికి తల, ఛాతీ, పొట్ట, తుంటి భాగాలకు కూడా మంచి రక్షణ లభించింది. ఫ్రంటల్ ఆఫ్‌సెట్ డిఫార్మబుల్ బారియర్ టెస్ట్ – 15.70/16 పాయింట్లు. సైడ్ మూవబుల్ డిఫార్మబుల్ బారియర్ టెస్ట్ – 16/16 పాయింట్లు
పిల్లల భద్రత విషయంలో కియా సెల్టోస్ 49కి గాను మొత్తం 45 స్కోర్ సాధించింది. డైనమిక్‌లో 24కి 24, CRS (క్రాస్-ఎర్త్ రేటింగ్)లో 12కి 12 స్కోర్ సాధించింది. అయితే, వెహికల్ అసెస్‌మెంట్‌లో ఇది 13కి 9 స్కోర్ చేసింది. ఈ పరీక్ష సమయంలో 18 నెలలు, 3 సంవత్సరాల వయస్సు గల పిల్లల డమ్మీ మోడళ్లను ఉపయోగించారు. ఫ్రంటల్, సైడ్ ఇంపాక్ట్ క్రాష్ టెస్టులలో ఇది పూర్తి మార్కులు సాధించింది. సెల్టోస్ డైనమిక్, CRS స్కోర్‌లలో కూడా పూర్తి మార్కులు సాధించింది, కానీ వెహికల్ అసెస్‌మెంట్‌లో నాలుగు పాయింట్లు కోల్పోయి, మొత్తం 45 స్కోరును పొందింది.
కియా సెల్టోస్ భద్రతా ఫీచర్లు
భద్రత కోసం, అన్ని సెల్టోస్ మోడళ్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, పార్కింగ్ సెన్సార్లు, రియర్‌వ్యూ కెమెరా, ఏబీఎస్, టీపీఎంఎస్, ఈఎస్‌సీ, స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్ వంటివి ఉంటాయి. దీనితో పాటు అన్ని చక్రాలకు డిస్క్ బ్రేకులు, డౌన్‌హిల్ బ్రేక్ కంట్రోల్, చైల్డ్ సీట్ మౌంట్‌లు కూడా వస్తాయి.
Also Read:IPL 2026-MS Dhoni: ఎంఎస్ ధోనీ ఫాన్స్‌కు భారీ షాక్.. ఐపీఎల్ 2026 మొత్తానికి దూరం, బిగ్ ట్విస్ట్ కూడా!
సెల్టోస్ ధర రూ.10.99 లక్షల నుండి రూ.19.99 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్) ఉంది. ఇది రెనాల్ట్ డస్టర్, హ్యుందాయ్ క్రెటా, టాటా సియెర్రా, మారుతి గ్రాండ్ విటారా, హోండా ఎలివేట్, మారుతి విక్టోరియాస్, స్కోడా కుషాక్, వోక్స్‌వ్యాగన్ టైగన్‌లతో పోటీపడుతుంది.
