Site icon NTV Telugu

TS Ministers: ఢిల్లీలో తెలంగాణ మంత్రులు.. రాహుల్, ఖర్గేలతో సమావేశం..

Rahul

Rahul

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన విషయం తెలిసిందే.. కాగా, లోక్ సభ ఎన్నికలపై పార్టీ ఫోకస్ పెట్టింది. తెలంగాణలోని అన్ని స్థానాల్లో కాంగ్రెస్ గెలువాలని చూస్తోంది. ఈ క్రమంలో.. పార్టీ ముఖ్య నేతలు తీవ్రంగా పాటుపడుతున్నారు. ఇదిలా ఉంటే.. తెలంగాణ మంత్రులు కొందరు ఢిల్లీకి వెళ్లారు. కాసేపట్లో లోక్ సభ ఎన్నికల సన్నద్ధత సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణ లోక్ సభ ఇంచార్జిలతో అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ భేటీ కానున్నారు.

Read Also: Harsha Kumar: షర్మిల కాంగ్రెస్‌ పార్టీలో చేరిక కుట్రే.. మాజీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల అంశంపై చర్చించనున్నారు. లోక్ సభ స్థానాల్లో విజయం కోసం ఎలా చేయాలన్న దానిపై తెలంగాణ మంత్రులకు రాహుల్ గాంధీ, ఖర్గే సూచించనున్నారు. కాగా.. ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయానికి చేరుకున్న వారిలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, సీతక్క, కొండా సురేఖ, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఉన్నారు.

Read Also: Bandi Sanjay: కేటీఆర్కు బండి సంజయ్ కౌంటర్.. కేసీఆర్ అలా ఏమీ చేయలేదు..!

Exit mobile version