Site icon NTV Telugu

Vishnu Warrior: కేంద్ర సర్వీస్‌లోకి ఖమ్మం పోలీస్‌ కమిషనర్ విష్ణు వారియర్..

Vishnu Warrior

Vishnu Warrior

Vishnu Warrior: ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు వారియర్ కేంద్ర సర్వీసులోకి వెళ్లనున్నారు. ఐదేళ్లపాటు డిప్యూటేషన్‌పై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) ఎస్పీగా విష్ణు వారియర్ సేవలందించనున్నారు. కాగా.. విష్ణు వారియర్‌ను స్టేట్ సర్వీస్ నుంచి వెంటనే రిలీవ్ చేయాలంటూ తెలంగాణ సీఎస్‌కు కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది. కాగా.. ప్రస్తుతం ఖమ్మం పోలీస్ కమిషనర్‌గా విష్ణు వారియర్ విధులు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే.

Read Also: C.S Shanthi Kumari: రెండో రోజు విజయవంతంగా ప్రజాపాలన..

ఇదిలా ఉంటే.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినుంచి పెద్ద ఎత్తున ఐఏఎస్‌, ఐపీఎస్‌ల బదిలీలతో పాటు అన్ని శాఖల్లోనూ ప్రక్షాళన చేసింది. ఈ క్రమంలోనే.. కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఐఏఎస్ ఆమ్రపాలి కాటా తెలంగాణ సర్వీసుల్లో తిరిగి చేరారు. హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్‌గా సీఎం రేవంత్ రెడ్డి నియమించారు. అయితే.. ప్రభుత్వం చాలా వరకు ఐపీఎస్‌లను బదిలీ చేసినప్పటికీ.. ఖమ్మం సీపీగా ఉన్న విష్ణు వారియర్‌ను బదిలీ చేయలేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి పిలుపు రావటంతో.. ఆయన సెంట్రల్ సర్వీసుల్లోకి వెళ్లనున్నారు.

Read Also: Union Minister Mansukh Mandaviya: ఏపీలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం

Exit mobile version