NTV Telugu Site icon

Tandra Vinod Rao: మోడీ 400లకు పైగా స్థానాలను గెలవడం ఖాయం

Tandra Vinod Rao

Tandra Vinod Rao

Tandra Vinod Rao: తాను ఈ గడ్డ బిడ్డనని.. తనకు ఇక్కడి సమస్యలపై పూర్తి అవగాహన ఉందని ఖమ్మం బీజేపీ పార్లమెంట్‌ అభ్యర్థి తాండ్ర వినోద్‌ రావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఖమ్మం జిల్లాను అభివృద్ధి చేయడానికి తనకు ఖమ్మం పార్లమెంట్ స్థానాన్ని కేటాయించిన బీజేపీ అధిష్ఠానానికి వినోద్‌ రావు కృతజ్ఞతలు తెలిపారు. తనకు ఆర్‌ఎస్‌ఎస్‌లో పనిచేసిన అనుభవం ఉందన్నారు. తన విద్యాభ్యాసం మొత్తం పాల్వంచలోనే జరిగిందన్నారు.

నరేంద్ర మోడీ 400లకు పైగా స్థానాలను గెలుపొందడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రూ.12 కోట్ల రూపాయలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రోడ్లు, మరిన్ని సెంట్రల్ నిధులతో పార్క్‌లు, రైల్వేస్టేషన్‌లు అధునికరించడం జరిగిందన్నారు. భద్రాచలం మన జిల్లాలో ఉండడం మన అదృష్టమని.. భద్రాచలం నుంచి అయోధ్య వరకు ఒక కారిడారు నిర్మించాలని ఉందన్నారు. గత పది సంవత్సరాలుగా కేంద్రం నిధులు అడగకుండానే అనేక నిధులు కేటాయించడం జరిగిందన్నారు.

ఖమ్మం పార్లమెంట్‌లో ఎంతో మంది అభ్యర్థులకు అవకాశం కల్పించారు.. ఈ ఒక్క సారి ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపిస్తే.. ఎయిర్‌పోర్ట్ నిర్మాణంతో పాటు కేంద్రం నుంచి అనేక సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి చేస్తానని ప్రజలను కోరారు. మోడీ అంటే గ్యారంటీ.. గ్యారంటీ అంటే మోడీ మేము చేసేవే చేబుతాం.. చేసేవే ప్రజలకు చెబుతామన్నారు. ఒక్కసారి తనకు అవకాశం కల్పించాలని ఓటర్లకు తాండ్ర వినోద్‌ రావు కోరారు.

Show comments