IND vs AUS World Cup Final: ఫైనల్ మ్యాచ్ రద్దు చేయండి.. ఖలిస్థాన్ ఉగ్రవాదుల నుంచి బెదిరింపులు

Kalisthani

Kalisthani

Khalistani Terrorist Threatens: వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌ను నిలిపివేయాలని హెచ్చరిస్తూ ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ మరోమారు బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ సందర్భంగా ఓ వీడియోను రిలీజ్ చేశారు. 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్లు, 2002 నాటి గుజరాత్ అల్లర్ల గురించి తెలియజేస్తూ.. మతపరంగా ఓ వర్గం ప్రజలను రెచ్చగొట్టేలా ఈ వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై భారత్ అభిప్రాయాన్ని కూడా అతడు ప్రశ్నించాడు.

Read Also: Bhatti Vikramarka: సీఎం, మంత్రులు అందుబాటులో లేని సెక్రటేరియేట్ ఎందుకు..?

×
×
Ad

ఇక, అమెరికా ఆధారిత నిషేధిత సంస్థ సిక్‌ ఫర్ జస్టిస్ సంస్థకు గురుపత్వంత్ సింగ్ మెంబర్ గా ఉన్నాడు. భారత్‌కు వ్యతిరేకంగా ఆయన ఇప్పటికే పలుసార్లు హెచ్చరికలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీకి వార్నింగ్ ఇస్తూ.. గత నెలలో కూడా ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నుంచి మోడీ గుణపాఠం నేర్చుకోవాలన్నాడు. భారత్ లో కూడా ఇలాంటి యుద్ధం స్టార్ట్ అవుతుందని తెలిపాడు.

Read Also: KTR: కామారెడ్డిలో కేటీఆర్‌ రోడ్ షో.. రేవంత్‌రెడ్డికి మంత్రి కౌంటర్‌

అయితే, అహ్మదాబాద్ వేదికగా రేపు జరుగనున్న ప్రపంచకప్ ను దృష్టిలో పెట్టుకుని ఫైనల్ మ్యాచ్ ను క్యాన్సిల్ చేయాలని ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హెచ్చరికలు జారీ చేశాడు. టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌కి దేశ విదేశాల నుంచి ప్రముఖులతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ఉపప్రధాని కూడా హాజరవుతుండటంతో ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.