Hyderabad: హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ జీహెచ్‌ఎంసీ (GHMC) జోనల్ కార్యాలయంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఉదయం సుమారు 5 గంటల సమయంలో కార్యాలయంలోని రెండవ అంతస్తులో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (DRF) బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. మూడు ఫైర్ ఇంజన్ల సహాయంతో సిబ్బంది రెండు గంటలకు పైగా శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదం కారణంగా రెండవ అంతస్తు మొత్తం దట్టమైన పొగలు అలుముకున్నాయి. అకౌంట్స్, చెక్కులు, బిల్లులు మంజూరు చేసే (సాంక్షన్) విభాగంలో ఈ మంటలు అంటుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ అగ్నిప్రమాదంలో పలు కీలక ఫైళ్లు, ఫర్నిచర్ పూర్తిగా కాలిబూడిదయ్యాయి. ఈ ప్రమాదం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు తెలియాల్సి ఉంది.
Hyderabad: ఖైరతాబాద్ GHMC జోనల్ కార్యాలయంలో అగ్నిప్రమాదం.. కీలక ఫైళ్లు దగ్ధం!

Khairatabad Ghmc Zonal Office Fire
