NTV Telugu Site icon

Congress: కేసీ వేణుగోపాల్ ఇంటికి భట్టి, ఉత్తమ్.. కాసేపట్లో సీఎం అభ్యర్థిపై క్లారిటీ..?

Kc Venugopal

Kc Venugopal

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఇంట్లో కాంగ్రెస్ ముఖ్య నేతలతో కీలక సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశంలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ తో పాటు తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మాణిక్‌రావు ఠాక్రే, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి అభ్యర్థిపై ప్రధానంగా చర్చిస్తున్నట్లు సమాచారం. సీఎం అభ్యర్థి ఎంపికపై కాసేపట్లో కీలక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది.

Read Also: Bussiness Idea : మినరల్ వాటర్ ప్లాంట్ తో మంచి ఆదాయం..!

ఈ సమావేశం తర్వాత కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ నేరుగా హైదరాబాద్ కి రానున్నారు. గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్ లో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య సీఎం అభ్యర్థిని పేరును తెలియజేయనున్నారు. అయితే, ఈ భేటీకి ముందుకు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. పార్టీ విధేయులకు న్యాయం చేయాలని ఆయన కోరారు. హైదరాబాద్ లో తక్కువ సీట్లు వచ్చాయని.. ఇలాంటి పరిస్థితి వస్తుందనుకోలేదని ఆయన చెప్పారు. పార్టీ విధేయతను, ట్రాక్ రికార్డును చూడాలని ఆయన కోరారు. అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. నేను పీసీసీ ప్రెసిడెంట్ కాదు కాబట్టి ఆ స్థాయిలో ప్రచారం చేయలేదు అని అన్నారు. నాకిచ్చిన పని చేశాను.. పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తాను.. పార్టీ విధేయులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాను అని ఆయన తెలిపారు. హైదరాబాద్ లో వాష్ అవుట్ అయ్యాం.. హైదరాబాద్ లో ఇలాంటి ఫలితం వస్తుందని అనుకోలేదు.. సీఎం ఎంపికలో ఎలాంటి తాత్సారం జరగలేదు.. ఫలితాలు వచ్చి 48 గంటలు కూడా దాటలేదు అని ఎన్టీవీ ఇంటర్వ్యూలో ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.