NTV Telugu Site icon

Polavaram Project: పోలవరం ప్రాజెక్ట్ పనుల పురోగతిపై కీలక సమావేశం.. 2024 జూన్ కల్లా..

Polavaram Project Meeting

Polavaram Project Meeting

Key Meeting On Polavaram Project Work Process With Gajendra Singh Shekhawat: దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఆధ్వర్యంలో పోలవరం ప్రాజెక్ట్ పనుల పురోగతిపై కీలక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో.. ప్రధానంగా 6 అంశాలపై చర్చ సాగింది. పోలవరం ప్రాజెక్ట్ సవరించిన అంచనాలు, పునరావాసం, నష్టపరిహారం చెల్లింపుపై చర్చించారు. గత వారం తన ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం జగన్ కూడా కేంద్ర జలశక్తి మంత్రితో సమావేశం అయ్యారు. ఆ భేటీ తర్వాత జరిగిన ఈ సమావేశంలో.. ఏపీ ప్రభుత్వం తాత్కాలిక ఆర్ధిక సహాయం అర్థించింది. తొలి విడత పనుల్లో 41.15 మీటర్ల ఎత్తు వరకు ప్రాజెక్టు నిర్మాణంతో పాటు, సహాయ పునరావాస పనుల నిమిత్తం.. ఆర్థిక సహాయంగా 17 వేల 414 కోట్ల రూపాయలు ఇవ్వాలని కోరింది. తొలి దశలోనే 100 శాతం డ్యామ్ నిర్మాణం పూర్తి చేస్తామని ఏపీ ఇంజనీర్ ఇన్ చీఫ్ నారాయణరెడ్డి చెప్పారు.

Minister Venu Gopala Krishna: గత ప్రభుత్వం వ్యవసాయం దండగ అంటే.. సీఎం జగన్ భరోసా ఇస్తున్నారు

2025 జూన్ కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని ఇంతకుముందు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. అయితే.. ఓ ఏడాది ముందుగానే, అంటే 2024 జూన్ కల్లా పూర్తయ్యేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని కేంద్రమంత్రి షెకావత్ కోరారు. ఏపి ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం ప్రాజెక్ట్ సవరించిన అంచనాలను కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆమోదించి, నిధుల విడుదల కోసం ఆర్ధిక మంత్రిత్వ శాఖకు పంపే అవకాశం ఉంది. ఈ సమావేశం అనంతరం షెకావత్ మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పురోగతి, సమస్యలు సమీక్షించామన్నారు. పోలవరం ప్రాజెక్ట్ వేగంగా పూర్తవ్వాలన్నదే తమ సంకల్పమని తెలిపారు. కాగా.. ఈ సమావేశంలో జలశక్తి శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్, సలహాదారు వెదిరె శ్రీరామ్, ఏపీ ప్రభుత్వం ఇంజనీర్ ఇన్ ఛీఫ్ నారాయణ రెడ్డి, కేంద్ర జల సంఘం అధికారులు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధికారులు పాల్గొన్నారు.

Madhavilatha : పెళ్లిపై హాట్ కామెంట్స్ చేసిన మాధవిలత.. నెటిజన్స్ ట్రోల్స్..

Show comments