NTV Telugu Site icon

BC Janardhan Reddy: బీసీ జనార్థన్ రెడ్డి సమక్షంలో టీడీపీలో పలువురు చేరిక

Puli

Puli

పులి వచ్చింది.. మేక చచ్చింది.. ఈ డైలాగ్ ఇప్పుడు ఉమ్మడి కర్నూలు జిల్లాలో కీలకమైన బనగానపల్లె నియోజకవర్గానికి కరెక్ట్‌గా సూట్ అవుతోంది. ఈసారి బనగానపల్లె కోటపై ఎలాగైనా టీడీపీ జెండా ఎగరవేయాలని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్థన్ రెడ్డి పట్టుదలగా ఉన్నారు. అందుకే ఎన్నికల క్షేత్రంలోకి దూకి పెద్దపులిలా పంజా విసురుతూ వేట మొదలు పెట్టారు. తాజాగా కొలిమిగుండ్లలో కీలక నేత బీసీ జనార్థన్ రెడ్డికి తోడుగా వచ్చి చేరాడు.

Read Also: Kadiyam Srihari: పల్లా రాజేశ్వర్ రెడ్డి, రాజయ్య ఇద్దరూ తోడు దొంగలు..

నంద్యాల జిల్లాలోనే మోస్ట్ హాటెస్ట్ పొలిటికల్ సెంటర్.. బనగానపల్లె. ఇక్కడ మండే ఎండల కంటే. ఎక్కువగా రాజకీయం మంటలురేపుతూనే ఉంటుంది. గత ఎన్నికల్లో సొంత పార్టీలో వెన్నుపోట్లతో స్వల్ప తేడాతో ఓడిపోయిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డి ఈసారి బనగానపల్లె కోటపై టీడీపీ జెండా ఎగరవేయాలని ఫిక్స్ అయ్యారు. కీలక వైసీపీ నేతలు వరుసగా సైకిలెక్కుతుంది. ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి అత్యంత పన్నిహితుడైన కాట్రెడ్డి మల్లికార్జున రెడ్డి, చల్లా విజయ్ భాస్కర్ రెడ్డి, కాటసాని చంద్రశేఖర్ రెడ్డి, మెట్ల రామిరెడ్డి తదితర అగ్రనేతలు టీడీపీలో చేరి క్షేత్రస్థాయిలో అహర్నిశలు ప్రచారం చేస్తూ బీసీ జనార్థన్ రెడ్డి గెలుపు కోసం సర్వ శక్తులు ఒడ్డుతున్నారు.

Read Also: T. Rajaiah: కేసీఆర్, కేటీఆర్లను దారుణంగా మోసం చేసిన వ్యక్తి కడియం శ్రీహరి

అయితే, తాజాగా కొలిమిగుండ్ల మండలంలో ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి కోలుకోలేని దెబ్బ తగిలింది. గొర్విమానిపల్లిలో జరిగిన చేరికల కార్యక్రమంలొ ఉమ్మడి కర్నూలు జిల్లా ఎంపీటీసీల సంఘం అధ్యక్షులు, గొర్విమానిపల్లి ప్రస్తుత ఎంపీటీసీ పులి ప్రకాష్ రెడ్డితో పాటు అతని సోదరుడు పులి సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో ముగ్గురు వార్డు మెంబెర్లు, కీలక నాయకులు, కార్యకర్తలు బనగానపల్లె నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా పులిప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ.. కాటసాని రామిరెడ్డి నమ్మక ద్రోహనికి మారుపేరు అంటూ మండిపడ్డారు. గత ఐదేళ్లుగా బనగానపల్లె నియోజకవర్గంలో అభివృద్ధి అనేది లేదు.. కాటసాని రామిరెడ్డికి తన కుటుంబం మీద ఉన్న ప్రేమ కార్యకర్తల మీద, బనగానపల్లె ప్రజల మీద లేదన్నారు. చంద్రబాబు ప్రకటించిన సూపర్ 6 పథకాలకు ఆకర్షతులై, బనగానపల్లె నియోజకవర్గం అభివృద్ధి ఒక్క బీసీ జనార్దన్ రెడ్డితోనే సాధ్యమవుతుందని నమ్మి టీడీపీలో చేరినట్లు తెలిపారు. నియోజకవర్గాన్ని 2014 నుంచి 2019 వరకు ఎమ్మెల్యేగా ఉన్న బీసీ జనార్థన్ రెడ్డి రూ. 1800 కోట్లతో అభివృద్ధిపరిచారని గుర్తు చేశారు. రాబోయే ఎన్నికల్లో బనగానపల్లెలో కాటసాని రామిరెడ్డిని చిత్తుగా ఓడించి బీసీ జనార్థన్ రెడ్డిని గెలిపించుకుతీరుతామని పులి ప్రకాశ్ రెడ్డి వెల్లడించారు. కాగా, టీడీపీలో చేరిన పులి ప్రకాష్ రెడ్డితో పాటు పలువురు కీలక నేతలు, కార్యకర్తల చేరికను బీసీ జనార్థన్ రెడ్డి స్వాగతించారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం.. తగిన గౌరవం కల్పిస్తామని హామీ ఇచ్చారు.