Tehsildar Ramanaiah Case: విశాఖ జిల్లాలో తహశీల్దార్ హత్య కేసు సంచలనం సృష్టించింది. ఎమ్మార్వో ఇంటికి వెళ్లి ఓ ఆగంతకుడు రాడ్‌తో కొట్టి చంపేశాడు. రెవెన్యూ సిబ్బందిపై ఈ తరహా దారుణం విశాఖలో మొదటి సారి. ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. తహశీల్దార్ దారుణ హత్య కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. ఆగంతకుడు మాస్కు పెట్టుకుని తహశీల్దార్ రమణయ్య ఇంటికి వచ్చారు.
నిందితుడు తహశీల్దార్‌తో ఘర్షణ పడే కంటే ముందు మాట్లాడి మరో ఇద్దరు వెళ్లారు. పంచెలు కట్టుకుని వున్న ఇద్దరు వ్యక్తుల కదలికలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. హత్య వెనుక ఆ ఇద్దరు వ్యక్తుల ప్రమేయం వుందా లేదా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. వైట్ కలర్ పంచ, క్రీమ్ కలర్ షర్ట్‌లో ఒకరు.. వైట్ షర్ట్, వైట్ కలర్ పంచలో మరొకరు ఉన్నారు. పంచలు కట్టుకున్న వాళ్ళు ఆ టైంలో అక్కడ ఎందుకు వున్నారని పోలీసులు ఆరా తీస్తున్నారు. విధి నిర్వహణలో ముక్కు సూటిగా వ్యవహరించే రమణయ్యతో వాగ్వివాదం, దాడికి పాల్పడిన నిందితుడు ఎవరు నిర్ధారించుకునే పనిలో పోలీసులు ఉన్నారు.
Read Also: MRO Killed: అర్ధరాత్రి తహసీల్దార్ దారుణహత్య.. ఇనుప రాడ్డులతో దాడి
తహసీల్దార్ రమణయ్య మృతదేహానికి ప్రారంభం కానున్న పోస్టుమార్టం ప్రక్రియ జరగనుంది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అధికారులు అప్పగించనున్నారు. తహసీల్దార్ రమణయ్య అంత్యక్రియలు స్వగ్రామం శ్రీకాకుళం నందిగామ మండలం దిమ్మిలాడ గ్రామంలో చేయనున్నారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.