Site icon NTV Telugu

Congress: పీఏసీ సమావేశంలో కీలక నిర్ణయాలు

Pac

Pac

Congress: హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో పీఏసీ సమావేశం నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ పోటీ చేయాలని ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఇదిలా ఉంటే.. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఇంచార్జి మంత్రులను నియమించింది. 17 నియోజక వర్గాలకు 17 మంది మంత్రులకు బాధ్యతలు అప్పగించింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు రెండు పార్లమెంట్ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించింది పీఏసీ.

Read Also: Salaar Release Trailer: బిగ్ బ్రేకింగ్.. సలార్ రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది

పార్లమెంట్ నియోజక వర్గాల ఇంఛార్జీలు
చేవెళ్ల, మహబూబ్ నగర్- సీఎం రేవంత్ రెడ్డి
ఆదిలాబాద్, మహబూబాబాద్- భట్టి విక్రమార్క
ఖమ్మం- పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
నల్గొండ- ఉత్తమ్ కుమార్ రెడ్డి
కరీంనగర్- పొన్నం ప్రభాకర్

Read Also: NBK 109 : బాలయ్య మూవీ లో తమన్నా ఐటమ్ సాంగ్..?

ఇదిలా ఉంటే.. నామినేటెడ్ పోస్టుల భర్తీ వ్యవహారం ఇంచార్జి, ఏఐసీసీ కార్యదర్శిలకు సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు అప్పగించారు. నాగపూర్ సభ ఇంచార్జిగా మహేష్ గౌడ్ ను నియమించారు.

 

Exit mobile version