Site icon NTV Telugu

AP DSC 2025: డీఎస్సీ 2025 పై కీలక నిర్ణయం.. వెబ్‌సైట్ లోకి మెరిట్ లిస్ట్ విడుదల..

Ap Dcs

Ap Dcs

డీఎస్సీ 2025 పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వెబ్‌సైట్ లోకి మెరిట్ లిస్ట్ ను విడుదల చేసింది. రేపు ఉదయానికి సెలక్షన్ లిస్ట్ సిద్ధం చేసి రోస్టర్ పాయింట్స్ కి అనుగుణంగా ఎంపికైన అభ్యర్థులకు సమాచారం అందించనున్నారు అధికారులు. ఈ రాత్రికే అభ్యర్థులకు నేరుగా మొబైల్ ఫోన్ లకు సమాచారం ఇవ్వనున్నారు. 21 నుండి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు సమాచారం. సెప్టెంబర్ 5 నాటికి పాఠశాలల్లో కి కొత్త ఉపాధ్యాయులు కొలవుదీరనున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని పాఠశాలల్లో 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాల నియామకానికి మెగా డీఎస్సీ 2025 నిర్వహించింది.

Exit mobile version