సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశమైంది. ఈ సమావేశానికి మంత్రులు ఆదిమూలపు సురేష్, బొత్స సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అయితే.. ఆర్థిక శాఖ మంత్రి ఢిల్లీలో ఉండటంతో ఈ సమావేశంలో పాల్గొనలేదు. అయితే.. ఈ కేబినెట్ భేటీలో మంత్రి మండలి కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆర్5 జోన్‌లో ఇళ్ల నిర్మాణానికి ఆమోదం తెలిపింది మంత్రి మండలి. అయితే.. సమావేశం కొనసాగుతోంది.. ఈ నేపథ్యంలో.. పలు పరిశ్రమల ప్రతిపాదనల పై చర్చించి నిర్ణయం తీసుకోనున్న మంత్రి మండలి.. కడప జిల్లా వేంపల్లె మండలంలో 1500 మెగావాట్ల హైడ్రో స్టోరేజీ పవర్ ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపనుంది.
Also Read : Dil Raju :జవాన్ సినిమా తెలుగు హక్కుల కోసం ప్రయత్నిస్తున్న దిల్ రాజు..?
8,104 కోట్ల పెట్టుబడితో ప్రాజెక్టు పెట్టనున్న జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ లిమిటెడ్… 2450 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనతో నంద్యాల జిల్లా కోటపాడులో సోలార్, అనంతపురం జిల్లా బోయల ఉప్పలూరు, నంద్యాల, కడప జిల్లాలో ప్రాజెక్టులకు ఆమోదం తెలుపనుంది కేబినెట్. అంతేకాకుండా.. విశాఖ జిల్లా అన్నవరంలో మే ఫెయిర్ హెటళ్లు, రిసార్టుల ఏర్పాటుకు ఆమోదం తెలుపనున్న కేబినెట్.. తిరుపతి పేరూరు వద్ద 218 కోట్లతో హయత్ ఇంటర్‌నేషనల్ హోటల్ కు ఆమోదం తెలుపనుంది.
Also Read : Modi Tour: మరో 26 రాఫెల్ విమానాలు.. ప్రధాని ఫ్రాన్స్ పర్యటన వేళ కీలక ఒప్పందానికి ఛాన్స్
విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురం వద్ద హిందుస్థాన్ కోకాకోలా బెవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏర్పాటు పై నిర్ణయం తీసుకోనుంది. తిరుపతి జిల్లా వరదాయ పాలెం మండలం కువ్వకోలి వద్ద సీసీఎల్ పుడ్, బెవరేజెస్ లిమిటెడ్ కంపెనీ, నెల్లూరు జిల్లా కృష్ణపట్నం సమీపంలో ఎడిబుల్ ఆయిల్ తయారీ ఫ్యాక్టరీ, తిరుపతి జిల్లా శ్రీ సిటీ వద్ద కోకో బటర్, కోకో పౌడర్, కోకో మాస్ తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటు ప్రతిపాదన పై చర్చించనుంది ఏపీ కేబినెట్.
