Minister Kottu Satyanarayana: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ హాట్ కామెంట్స్ చేశారు. మాకు తొడలు కొట్టి మీసాలు తిప్పడం రాదు. నాయకుడంటే ఆదర్శం కావాలి, జగన్ మీద వ్యక్తిగత విమర్శలు చేయడం కాదని మంత్రి కొట్టు సత్యనారాయణ ఆరోపించారు. యువతకు పవన్ కల్యాణ్ చెడు సందేశం ఇస్తున్నాడని.. పవన్ కల్యాణ్ నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడని.. మీరు కూడా 40 పెళ్లిళ్లు చేసుకోండనే సందేశంతో ఆడపిల్లల తల్లిదండ్రులు బాగోద్వేగానికి గురవుతున్నారని తెలిపారు. పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టే ధోరణితో మాట్లాడుతున్నాడన్నారు. రాజకీయ పార్టీ నడపాలంటే భాషా ఆలోచన మార్చుకోవాలని మంత్రి కొట్టు సత్యనారాయణ సూచించారు.
Read Also: Chandramukhi 2: వినాయక చవితికి ‘చంద్రముఖి 2 రిలీజ్
అంతేకాకుండా 14 ఏళ్ళు పాలించిన చంద్రబాబుపై ఏరోజైనా ఎత్తి చూపాడా అని పవన్ కల్యాణ్ పై మండిపడ్డారు మంత్రి కొట్టు సత్యనారాయణ. కాపుల ద్రోహి చంద్రబాబుని పవన్ నెత్తిన పెట్టుకోవడం కరెక్ట్ కాదని తెలిపారు. పవన్ అసెంబ్లీలోకి వెళ్లాలంటే చంద్రబాబు కాదు, నిర్ణయించాల్సింది ప్రజలని ఆరోపించారు. ప్రభుత్వ పనితీరు బాగోలేదని చెప్పాల్సింది చంద్రబాబు, లోకేష్ కాదని.. ఏపీలోని 5 కోట్ల 30 లక్షల మంది ప్రజలు అన్నారు. మరోవైపు కేంద్రం ఏపీకి నిధులు అరకొర ఇస్తున్నారని.. సమృద్ధిగా ఇవ్వడం లేదని మంత్రి తెలిపారు. లోటు బడ్జెట్ కూడా సీఎం చోరవతో 9 ఏళ్ల తర్వాత ఇచ్చారని ఆరోపించారు. చంద్రబాబుకు దళితులు అంటే అసహ్యమని.. దళితులుగా పుట్టాలని కోరుకుంటారా అని బాహాటంగా అవమానించి కవర్ చేసుకోవడానికి చెప్పే మాటలను దళితులు క్షమించరని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు.