NTV Telugu Site icon

BJP Leader Laxman : 2024 పార్లమెంట్ ఎన్నికల్లో మిషన్ 405తో ముందుకు వెళ్లాలి

Mp Laxman

Mp Laxman

BJP Leader Laxman : సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యమని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. బీఆర్ఎస్ కు ప్రజల్లో ఆదరణ లేదని తెలిపారు. గుజరాత్ గురించి మాట్లాడే ముందు బీఆర్ఎస్ నేతలు ఆలోచించుకోవాలని లక్ష్మణ్ సూచించారు. బీజేపీని విమర్శించే అర్హత బీఆర్ఎస్ కు లేదని చెప్పారు. బీజేపీ కార్యకర్తల పార్టీ అని తెలిపారు. జేపీ నడ్డా నాయకత్వంలో బీజేపీ మరింత బలపడిందని పేర్కొన్నారు. తొమ్మిది రాష్ట్రాల ఎన్నికలను కమలం సవాల్ గా స్వీకరించిందన్నారు. బీజేపీ కార్యవర్గ సమావేశాల్లో 2024 పార్లమెంట్ ఎన్నికల్లో మిషన్ 405తో ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.

Read Also: Public Urination : గోడలపై మూత్రం పోయాలనుకుంటున్నారా.. తస్మాత్ జాగ్రత్త

ప్రతిపక్ష పార్టీలన్నీ బీజేపీని ఓడించాలని చూస్తున్నారు తప్పా… ప్రజల సంక్షేమం గురించి ఆలోచించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణతో పాటు ఈ యేడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు లక్ష్మణ్. మంత్రి కేటీఆర్ చదువుకున్న అజ్ఞాని అని…బావిలో కప్ప మాదిరిగా మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కేంద్ర నాయకత్వం కార్యచరణ రూపొందించింది. ఈ నెల 29, 30న హరియాణాలోని గుర్గావ్ లో జాతీయ ఓబీసీ మోర్చా జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 24న పాలమూరులో రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరుగుతాయన్నారు. గుజరాత్ మోడల్ డెవలప్ మెంట్ ను తెలంగాణలో అమలు చేస్తామన్నారు. బండి సంజయ్ పాదయాత్రను మోడీ కొనియాడారంటే..రాష్ట్ర అధ్యక్ష పదవి కొనసాగింపు ఉంటుందా ? లేదా ? అన్నది మీరే అర్ధం చేసుకోవాలన్నారు.