Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Kevin Pietersen As Delhi Capitals Mentor

DC: ఢిల్లీ క్యాపిటల్స్ మెంటర్‌గా కెవిన్ పీటర్సన్..

Published Date :February 27, 2025 , 4:20 pm
By Rajesh Veeramalla
  • ఢిల్లీ క్యాపిటల్స్ మెంటర్‌గా మాజీ ఇంగ్లాండ్ కెప్టెన్ కెవిన్ పీటర్సన్
  • ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ప్రకటించిన ఫ్రాంచైజీ
  • గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఆడిన కెవిన్ పీటర్సన్.
DC: ఢిల్లీ క్యాపిటల్స్ మెంటర్‌గా కెవిన్ పీటర్సన్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ తమ మాజీ ఇంగ్లాండ్ కెప్టెన్ కెవిన్ పీటర్సన్‌ను మెంటర్‌గా నియమించింది. ఫ్రాంచైజీ ఫిబ్రవరి 27 గురువారం ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ప్రకటించింది. కెవిన్ పీటర్సన్.. హెడ్ కోచ్ హేమాంగ్ బదానీతో కలిసి పనిచేయనున్నారు. 2024 సీజన్ చివరలో రికీ పాంటింగ్‌తో విడిపోయిన తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ తమ కోచింగ్ స్ట్రక్చర్‌ను పూర్తిగా మార్చుకుంది. గత మెగా వేలంలో భారత మాజీ ఆల్‌రౌండర్ హేమాంగ్ బదానీ పాల్గొని.. కొన్ని స్మార్ట్ కొనుగోళ్లు చేయడంలో పెద్ద పాత్ర పోషించారు.

Read Also: Time Use Survey: సెల్ఫ్ కేర్‌ మరిచి, పనిలోనే ఎక్కువ సమయం గడుపుతున్న భారతీయులు,

కెవిన్ పీటర్సన్ ఐపీఎల్‌లో మెంటర్‌గా బాధ్యతలు చేపట్టడం ఇదే తొలిసారి. అతను 2016లో ఐపీఎల్‌లో ఆడాడు. తరువాత రిటైర్మెంట్ ఇచ్చాడు. ఇదిలా ఉంటే.. ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్‌కు తమ కెప్టెన్‌ను ఇంకా ప్రకటించలేదు. కాగా.. జట్టు క్రికెట్ డైరెక్టర్‌గా వేణుగోపాల్ రావు, బౌలింగ్ కోచ్‌గా మునాఫ్ పటేల్ బాధ్యతలు వహించనున్నారు. మరోవైపు.. మాథ్యూ మోట్‌ను అసిస్టెంట్ కోచ్‌గా ఢిల్లీ క్యాపిటల్స్ నియమించుకుంది. మోట్ గతంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో పనిచేశాడు. ఆ తర్వాత.. ఇంగ్లాండ్ క్రికెట్ జట్టుతో వైట్-బాల్ కోచ్‌గా పనిచేశాడు. 2022లో ఇంగ్లాండ్ టీ20 ప్రపంచ కప్ గెలిచినప్పుడు అతను జట్టుకు కోచ్‌గా ఉన్నాడు.

Read Also: Vizag: మెడిసిన్ కొనడానికి వచ్చి ప్రాణాలు విడిచిన వ్యక్తి..

కెవిన్ పీటర్సన్, 2014 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా బాధ్యతలు వహించాడు. అయితే ఆ సీజన్‌లో ఢిల్లీ కేవలం రెండు విజయాలతో చివరి స్థానంలో నిలిచింది. పీటర్సన్ 2009, 2010లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడిన తర్వాత.. 2012, 2014లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడాడు. 2012 సీజన్‌లో అతను 305 పరుగులతో అతని అత్యుత్తమ ప్రదర్శనను సాధించాడు. 2016లో పీటర్సన్ తన ఐపీఎల్ కెరీర్‌ను రైజింగ్ పూణే సూపర్‌జెయింట్‌తో ముగించాడు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • delhi capitals
  • Delhi Capitals Mentor
  • Hemanth Badani
  • IPL 2025
  • Kevin Pietersen

తాజావార్తలు

  • Breaking News: బీజేపీ కార్యాలయం వెలుపల పేలుడు..

  • Minister Narayana: మూడు ముక్కలాట ముగిసింది.. 2028 ఆగస్టుకి అమరావతిని ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేస్తాం!

  • Iran: పేరుకు మాత్రమే ఇరాన్ అధ్యక్షుడు.. ఇప్పుడు అధికారం అంతా వారిదే..

  • Redmi A7 Pro: 6,000mAh బ్యాటరీ, 6.9-అంగుళాల డిస్‌ప్లేతో.. రెడ్‌మీ A7 ప్రో విడుదల

  • Digital Payments: ఏప్రిల్ 1 నుంచి పేమెంట్ చేసేటప్పుడు జాగ్రత్త.. నేటి నుంచి OTP ఒక్కటే ఎందుకు పని చేయదు?

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions