ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ తమ మాజీ ఇంగ్లాండ్ కెప్టెన్ కెవిన్ పీటర్సన్‌ను మెంటర్‌గా నియమించింది. ఫ్రాంచైజీ ఫిబ్రవరి 27 గురువారం ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ప్రకటించింది. కెవిన్ పీటర్సన్.. హెడ్ కోచ్ హేమాంగ్ బదానీతో కలిసి పనిచేయనున్నారు. 2024 సీజన్ చివరలో రికీ పాంటింగ్‌తో విడిపోయిన తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ తమ కోచింగ్ స్ట్రక్చర్‌ను పూర్తిగా మార్చుకుంది. గత మెగా వేలంలో భారత మాజీ ఆల్‌రౌండర్ హేమాంగ్ బదానీ పాల్గొని.. కొన్ని స్మార్ట్ కొనుగోళ్లు చేయడంలో పెద్ద పాత్ర పోషించారు.
Read Also: Time Use Survey: సెల్ఫ్ కేర్ మరిచి, పనిలోనే ఎక్కువ సమయం గడుపుతున్న భారతీయులు,
కెవిన్ పీటర్సన్ ఐపీఎల్‌లో మెంటర్‌గా బాధ్యతలు చేపట్టడం ఇదే తొలిసారి. అతను 2016లో ఐపీఎల్‌లో ఆడాడు. తరువాత రిటైర్మెంట్ ఇచ్చాడు. ఇదిలా ఉంటే.. ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్‌కు తమ కెప్టెన్‌ను ఇంకా ప్రకటించలేదు. కాగా.. జట్టు క్రికెట్ డైరెక్టర్‌గా వేణుగోపాల్ రావు, బౌలింగ్ కోచ్‌గా మునాఫ్ పటేల్ బాధ్యతలు వహించనున్నారు. మరోవైపు.. మాథ్యూ మోట్‌ను అసిస్టెంట్ కోచ్‌గా ఢిల్లీ క్యాపిటల్స్ నియమించుకుంది. మోట్ గతంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో పనిచేశాడు. ఆ తర్వాత.. ఇంగ్లాండ్ క్రికెట్ జట్టుతో వైట్-బాల్ కోచ్‌గా పనిచేశాడు. 2022లో ఇంగ్లాండ్ టీ20 ప్రపంచ కప్ గెలిచినప్పుడు అతను జట్టుకు కోచ్‌గా ఉన్నాడు.
Read Also: Vizag: మెడిసిన్ కొనడానికి వచ్చి ప్రాణాలు విడిచిన వ్యక్తి..
కెవిన్ పీటర్సన్, 2014 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా బాధ్యతలు వహించాడు. అయితే ఆ సీజన్‌లో ఢిల్లీ కేవలం రెండు విజయాలతో చివరి స్థానంలో నిలిచింది. పీటర్సన్ 2009, 2010లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడిన తర్వాత.. 2012, 2014లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడాడు. 2012 సీజన్‌లో అతను 305 పరుగులతో అతని అత్యుత్తమ ప్రదర్శనను సాధించాడు. 2016లో పీటర్సన్ తన ఐపీఎల్ కెరీర్‌ను రైజింగ్ పూణే సూపర్‌జెయింట్‌తో ముగించాడు.