Kesineni Swetha: ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 45 వ డివిజన్ గడప గడపకు ఎన్నికల ప్రచారంలో కేశినేని శ్వేత పాల్గొన్నారు. కేశినేని నాని,షేక్ ఆసిఫ్ విజయాన్ని ఆకాంక్షిస్తూ ప్రతి గడపకు వెళ్తుంటే మంచి రెస్పాన్స్ వస్తోందని ఆమె వెల్లడించారు. ఈ ప్రాంత ప్రజలు ఒకటే చెప్తున్నారని.. మాకు ఏ సహాయం కావాలన్నా గత 10 సంవత్సరాల నుంచి కేశినేని భవన్ వచ్చే వాళ్ళమని చెప్పామన్నారు. కేశినేని నాని మా సమస్యలు వినడమే కాకుండా చాలా ఆప్యాయంగా పలకరించే వారని అని చెప్తున్నారంటూ ఆమె తెలిపారు.
ప్రజలు ఒకటే చెప్తున్నారు కేశినేని నాని లాంటి మంచి నాయకున్ని వదులుకోమంటున్నారని.. మళ్లీ కేశినేని నానిని ఎంపీగా గెలిపించుకుంటాం అంటున్నారని.. అది వింటుంటే చాలా ఆనందంగా ఉందని కేశినేని శ్వేత హర్షం వ్యక్తం చేశారు. గత 10 సంవత్సరాలుగా విజయవాడకు నిరంతర సేవలు అందించిన వ్యక్తి కేశినేని నాని అంటూ పేర్కొన్నారు. 8000 కోట్లతో విజయవాడను అభివృద్ధి చేసిన వ్యక్తి కేశినేని నాని అంటూ చెప్పుకొచ్చారు. ఎయిర్ పోర్ట్, హాస్పిటల్స్, ఫ్లైఓవర్ అంటూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు విజయవాడ కోసం చేశారన్నారు. గత 10 సంవత్సరాలుగా కేశినేని నాని మార్క్ విజయవాడ ప్రజలకు తెలుసన్నారు. ప్రజల మద్దతు, ఆదరణ ఆయనకు మెండుగా ఉందన్నారు. ఈ రోజు రాజకీయాల్లో డబ్బు ఒకటే కాదు మంచితనం ప్రజలకు సేవ చేస్తే ప్రజలు తప్పకుండా ఆదరిస్తారన్నారు. జగనన్న ప్రభుత్వంలో ప్రజలు అందరూ సంతోషంగా ఉన్నారని.. వైసీపీ ప్రభుత్వమే మరోసారి వస్తుందని ప్రజలు చెబుతున్నారని కేశినేని శ్వేత తెలిపారు. కచ్చితంగా ఎంపీగా కేశినేని నానిని, ఎమ్మెల్యేగా ఆసిఫ్‌ను మంచి మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నామన్నారు.